ENG vs SL : శ్రీలంక రెండు, ఇంగ్లాండ్ ఒకటి.. గెలుపు ఎవరిది..?
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న శ్రీలంక జట్టు మరో సమరానికి సిద్ధమైంది.

ENG vs SL
England vs Sri Lanka : ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న శ్రీలంక జట్టు మరో సమరానికి సిద్ధమైంది. తొలి టెస్టులో ఓడిపోయిన లంక జట్టు లార్డ్స్ వేదికగా నేటి(ఆగస్టు 29 గురువారం) నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టులో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో ఇరుజట్లు తమ తుది జట్లను ప్రకటించాయి. ఈ మ్యాచ్‌లో లంక జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది.
మొదటి టెస్ట్‌లో ఆడిన కుశాల్ మెండిస్, విశ్వ ఫెర్నాండో స్థానాల్లో పాతుమ్ నిస్సాంక, లహీరు కుమారలను తుది జట్టులోకి తీసుకుంది. అటు ఇంగ్లాండ్ సైతం ఓ మార్పుతో బరిలోకి దిగుతోంది. మొదటి టెస్టులో గాయపడిన మార్క్ వుడ్ స్థానంలో ఓలీ స్టోన్ తుది జట్టులోకి తీసుకుంది.
కాగా.. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచుల టెస్టు సిరీస్ జరుగుతోంది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 236 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌ల్లో 358 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్‌కు 122 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 326 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్ ముందు 205 పరుగుల లక్ష్యాన్ని నిలిచింది. ఈ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఐదు వికెట్లు కోల్పోయి అందుకుంది.
రెండో టెస్టుకు తుది జట్లు..
శ్రీలంక : దిముత్ కరుణరత్నే, నిషాన్ మదుష్క, పాతుమ్ నిస్సాంక, ఏంజెలో మాథ్యూస్, దినేష్ చండిమాల్, ధనంజయ డి సిల్వా (కెప్టెన్), కమిందు మెండిస్, ప్రబాత్ జయసూర్య, అసిత ఫెర్నాండో, లహిరు కుమార, మిలన్ రత్నాయక్
ఇంగ్లాండ్ : బెన్ డకెట్, డేనియల్ లారెన్స్, ఓలీ పోప్(కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్(వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, మాథ్యూ పాట్స్, ఓలీ స్టోన్, షోయబ్ బషీర్