Ravichandran Ashwin : అశ్విన్ భయ్యా.. ఇలా చేశావేంటి..? నీ బౌలింగ్‌లో షాట్లు కొట్టారనేనా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) విజయవంతంగా 17 సీజన్లు పూర్తి చేసుకుంది.

Ravichandran Ashwin picks his all time IPL XI No Chris Gayle or Kieron Pollard
Ravichandran Ashwin : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) విజయవంతంగా 17 సీజన్లు పూర్తి చేసుకుంది. ఎంతో మంది బ్యాటర్లు తమ విధ్వంసకర బ్యాటింగ్‌తో అలరించారు. తామేమీ తక్కువ కాదన్నట్లు బౌలర్లు సైతం వికెట్లు వేట సాగించారు. ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ సీజన్లలోంచి టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ తన ఆల్‌టైమ్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకున్నాడు. ఇందులో టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్‌గేల్, డేవిడ్ వార్నర్ వంటి ఆటగాళ్లను చోటు ఇవ్వలేదు.
భారత జట్టు మాజీ ఓపెనర్ క్రిస్ శ్రీకాంత్‌కు చెందిన యూట్యూబ్ (చీకీ చీకా) ఛానల్‌తో మాట్లాడుతూ అశ్విన్ తన ఆల్‌టైమ్ ఐపీఎల్ ఎలెవన్‌ను ప్రకటించాడు. తన జట్టుకు కెప్టెన్‌గా, కీపర్‌గా ఎంఎస్ ధోని ని ఎంపిక చేశాడు. ఇక ఓపెనర్లుగా ఐదు సార్లు ముంబైకి ఐపీఎల్ టైటిల్‌ను అందించిన రోహిత్ శర్మను ఎంచుకున్నాడు. అతడికి జోడిగా విరాట్ కోహ్లీని ఎంపిక చేశాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు సార్లు ఐపీఎల్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన సురేశ్ రైనాను మూడో స్థానానికి తీసుకున్నాడు. ముంబై కీలక ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌ను నాలుగో స్థానానికి ఎంచుకున్నాడు.
ENG vs SL : శ్రీలంక రెండు, ఇంగ్లాండ్ ఒకటి.. గెలుపు ఎవరిది..?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన ఏబీ డివిలియర్స్‌కు మిడిల్ ఆర్డర్‌లో చోటు ఇచ్చాడు. ఇక ఆరులో ధోనిని తీసుకోగా స్పెషలిస్టు స్పిన్నర్లుగా సునీల్ నరైన్, రషీద్ ఖాన్‌లను తీసుకున్నాడు. పేసర్లుగా భువనేశ్వర్ కుమార్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా ఎంచుకున్నాడు.
కాగా.. ఈ జట్టులో క్రిస్‌గేల్, డేవిడ్ వార్నర్, కీరన్ పొలార్డ్ వంటి విధ్వంసకర వీరులకు చోటు ఇవ్వలేదు. ఐపీఎల్ నియమాలు అనుసరించి నలుగురు విదేశీ ఆటగాళ్లకు మాత్రమే స్థానం కల్పించాడు.
కాగా.. అశ్విన్ జట్టుపై నెటిజన్లు స్పందిస్తూ గేల్, వార్నర్ లు నీ బౌలింగ్‌లో షాట్లు కొట్టారనే వాళ్లను ఎంపిక చేయలేదా అని నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
రవిచంద్రన్ అశ్విన్ ఆల్ టైమ్ ఐపీఎల్ ఎలెవన్ : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, సూర్యకుమార్ యాదవ్, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోని (కెప్టెన్), సునీల్ నరైన్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ