Pujara : ఇక చాలు.. యువకులకు ఛాన్స్ ఇవ్వు.. పుజారాకు ధావన్ కౌంటర్
సీనియర్ ఆటగాళ్లు శిఖర్ ధావన్, ఛతేశ్వర్ పుజారాలు ఒకప్పుడు భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. అయితే.. ఫామ్ లేమీ, యువ ఆటగాళ్ల రాకతో ఈ ఇద్దరు వెటరన్ ఆటగాళ్లు టీమ్ఇండియాకు దూరం అయ్యారు.
- Thota Vamshi Kumar
- Published On : September 28, 2023 / 04:13 PM IST
Pujara-Shikhar Dhawan
Pujara-Shikhar Dhawan : సీనియర్ ఆటగాళ్లు శిఖర్ ధావన్ (Shikhar Dhawan), ఛతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara ) లు ఒకప్పుడు భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. అయితే.. ఫామ్ లేమీ, యువ ఆటగాళ్ల రాకతో ఈ ఇద్దరు వెటరన్ ఆటగాళ్లు ఇప్పుడు టీమ్ఇండియాకు దూరం అయ్యారు. ప్రస్తుతం భారత జట్టులో లేకపోయినప్పటికీ ఈ ఇద్దరు ఆటగాళ్లకు దేశ వ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్నారు. కాగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో పుజారా ఓ వీడియో పోస్ట్ చేయగా శిఖర్ ధావన్ చేసిన కామెంట్ వైరల్ గా మారింది.
టీమ్ఇండియాకు దూరం కావడంతో పుజరా ఇంగ్లాండ్‌కు వెళ్లి కౌంటీ క్రికెట్ ఆడాడు. అక్కడ వరుస శతకాలతో దుమ్మురేపాడు. కౌంటీ సీజన్ ముగియడంతో స్వదేశానికి వచ్చాడు. ప్రస్తుతం ఇరానీ ట్రోఫీ కోసం సిద్ధం అవుతున్నాడు. ఇందుకోసం ప్రాక్టీస్ మొదలెట్టాడు. అందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
ఇరానీ ట్రోఫీ కోసం తిరిగి మైదానంలో అడుగుపెట్టడం ఆనందంగా ఉందని రాసుకొచ్చాడు. దీనిపై శిఖర్ ధావన్ ఫన్నీగా కామెంట్ చేశాడు. ఇరానీ ట్రోఫీ నీకు చాలా పాతదైపోయింది. ఇప్పటికైనా యువకులు ఆడేందుకు అవకాశం ఇవ్వు అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం శిఖర్ ధావన్ కామెంట్ వైరల్‌గా మారింది.
ఇదిలా ఉంటే.. పుజారా చివరి సారిగా టీమ్ఇండియా తరుపున ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో ఘోరంగా విఫలం అవ్వడంతో విమర్శలు ఎదుర్కొనడంతో పాటు జట్టులో చోటు కోల్పోయాడు. అటు శిఖర్ ధావన్ భారత జట్టుకు దూరమై చాలా కాలం కావొస్తుంది. గతేడాది డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌పై చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. 2021లో చివరి టీ20 మ్యాచ్ ఆడాడు.
