Shreyas Iyer : తొలి వన్డేలో విజయం.. శ్రేయస్ అయ్యర్ పోస్ట్ వైరల్.. టీ20 సిరీస్‌లో కలిసి కట్టుగా ఆడలేదా?
తొలి వన్డేలో భారత జట్టు విజయం సాధించిన తరువాత శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.
- Thota Vamshi Kumar
- Updated on- July 15, 2026 / 12:07 PM IST
Shreyas Iyer team effort post viral after India beat England in 1st ODI
Shreyas Iyer : ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో బరిలోకి దిగిన భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. కాగా.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన అనంతరం వన్డే వైస్ కెప్టెన్, టీ20 కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
మ్యాచ్‌లోని కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ.. టీమ్ ఎఫర్ట్ అని క్యాప్షన్ ఇచ్చాడు. దీనిపైనే నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
Virat Kohli : విరాట్ కోహ్లీ అరుదైన ఘనత.. వన్డే దిగ్గజాలు సచిన్, ద్రావిడ్ సరసన చోటు..
వన్డే సిరీస్ కన్నా ముందు భారత జట్టు ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ను ఆడింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో బరిలోకి దిగిన భారత జట్టును ఇంగ్లాండ్ వైట్ వాష్ చేసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్ గెలుపొంది 4-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
తొలి వన్డే అనంతరం టీమ్ ఎఫర్ట్ అంటూ అయ్యర్ పెట్టిన పోస్టును.. ప్రస్తుత నాయకత్వంలో జట్టు సాధిస్తున్న విజయాన్ని, గతంలో పేలవమైన ఫలితాలు ఇచ్చిన నాయకత్వపు జట్టుతో పోల్చి చూస్తున్నారు. అయ్యర్ సారథ్యంలో టీ20 సిరీస్‌లో జట్టు కలిసి కట్టుగా ఆడలేదా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
IND vs ENG : గెలుపు జోష్‌లో ఉన్న భారత్‌కు భారీ షాక్..!
