Shubman Gill : సూపర్ మ్యాన్‌ త‌ర‌హాలో స్ట‌న్నింగ్ క్యాచ్ అందుకున్న శుభ్‌మ‌న్ గిల్‌.. వీడియో వైర‌ల్‌

టీమ్ఇండియా ఆట‌గాడు శుభ్‌మ‌న్ గిల్ వెనక్కి ప‌రిగెత్తుకుంటూ వెళ్లి డైవ్ చేస్తూ అద్భుత క్యాచ్ అందుకున్నాడు.

Shubman Gill goes full superman mode to take stunning catch

Shubman Gill stunning catch : నామ‌మాత్ర‌మైన ఆఖ‌రి ఐదో టెస్టు మ్యాచ్ ధ‌ర్మ‌శాల వేదిక‌గా ప్రారంభ‌మైంది. ఈ మ్యాచ్‌లో భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఆట‌గాడు శుభ్‌మ‌న్ గిల్ వెనక్కి ప‌రిగెత్తుకుంటూ వెళ్లి డైవ్ చేస్తూ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ ఓపెన‌ర్లు జాక్‌క్రాలీ, బెన్‌డ‌కెట్ (27) లు భార‌త పేస‌ర్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్నారు. 17వ ఓవ‌ర్ వ‌ర‌కు వికెట్ ఇవ్వ‌లేదు. కాగా.. 18వ ఓవ‌ర్‌ను కుల్దీప్ యాద‌వ్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని చివ‌రి బంతిని కుల్దీప్ గూగ్లీ గా వేశాడు. దీన్ని త‌ప్పుగా అంచ‌నా వేసిన బెన్‌డ‌కెట్ భారీ షాట్‌కు య‌త్నించాడు. అయితే.. షాట్ స‌రిగ్గా క‌నెక్ట్ కాలేదు. ఎక్స్‌ట్రాక‌వ‌ర్స్ మీదుగా బంతి గాల్లోకి లేచింది.

Ashwin : హాస్పిట‌ల్‌ బెడ్ పై ఉన్న అమ్మ నాకు చెప్పింది అదే : ర‌విచంద్ర‌న్ అశ్విన్‌

క‌వ‌ర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న గిల్‌.. త‌న కుడి వైపు వేగంగా బంతిని గ‌మ‌నిస్తూ వెన‌క్కి ప‌రిగెత్తుకుంటూ వెళ్లి డైవ్ చేస్తూ బంతిని ఒడిసి ప‌డ్డుకున్నాడు. గిల్ దాదాపు 20 నుంచి 25 యాడ్స్‌ దూరం ప‌రిగెత్తాడ‌ని కామెంటేట‌ర్ ర‌విశాస్త్రి చెప్పాడు. గిల్‌ను అంద‌రూ అభినందించారు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. సూప‌ర్ మ్యాన్‌లా డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నావ‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా.. ఇంగ్లాండ్ లంచ్ విరామానికి రెండు వికెట్లు న‌ష్ట‌పోయి 100 ప‌రుగులు చేసింది. జాక్‌క్రాలీ (61), జోరూట్ (0) లు క్రీజులో ఉన్నారు.

Sachin Tendulkar : బిగ్‌బాస్ విన్న‌ర్ చేతిలో ఔటైన స‌చిన్ టెండూల్క‌ర్‌.. వీడియో వైర‌ల్‌

ట్రెండింగ్ వార్తలు