Ashwin : హాస్పిట‌ల్‌ బెడ్ పై ఉన్న అమ్మ నాకు చెప్పింది అదే : ర‌విచంద్ర‌న్ అశ్విన్‌

భార‌త సీనియ‌ర్ ఆట‌గాడు ర‌విచంద్ర‌న్ అశ్విన్ అరుదైన క్ల‌బ్‌లో అడుగుపెట్టాడు.

Ashwin : హాస్పిట‌ల్‌ బెడ్ పై ఉన్న అమ్మ నాకు చెప్పింది అదే : ర‌విచంద్ర‌న్ అశ్విన్‌

Ravichandran Ashwin

Ravichandran Ashwin : భార‌త సీనియ‌ర్ ఆట‌గాడు ర‌విచంద్ర‌న్ అశ్విన్ అరుదైన క్ల‌బ్‌లో అడుగుపెట్టాడు. టీమ్ఇండియా త‌రుపున 100 టెస్టులు ఆడిన ఆట‌గాళ్ల జాబితాలో చోటు సంపాదించాడు. ధ‌ర్మ‌శాల వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌తో అశ్విన్ ఈ ఘ‌న‌త‌ను అందుకున్నాడు. ఈ సంద‌ర్బంగా ధ‌ర్మ‌శాల‌లో హెడ్‌కోచ్ రాహుల్ ద్ర‌విడ్, ఆట‌గాళ్లు అశ్విన్‌ను ప్ర‌త్యేక అభినంద‌న‌లు తెలిపారు.

వందో టెస్టు క్యాప్‌ను ద్ర‌విడ్ చేతుల మీదుగా అశ్విన్ అందుకున్నాడు. ఆ త‌రువాత త‌న భార్య ఇద్ద‌రు కూతుళ్ల‌తో క‌లిసి అశ్విన్ ఫోటోలు దిగాడు.

Sachin Tendulkar : బిగ్‌బాస్ విన్న‌ర్ చేతిలో ఔటైన స‌చిన్ టెండూల్క‌ర్‌.. వీడియో వైర‌ల్‌

కాగా.. అశ్విన్ మైదానంలోకి అడుగుపెట్టేస‌మ‌యంలో భార‌త ఆటగాళ్లు ఇరువైపులా నిల‌బ‌డి అత‌డిని గార్డ్ ఆఫ్ ఆన‌ర్‌తో గౌర‌వించారు.

ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ ముందు అశ్విన్ మీడియాతో మాట్లాడాడు. రాజ్‌కోట్‌లో ఇంగ్లాండ్‌తో జ‌రిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసిన త‌రువాత ఫ్యామిలీ ఎమ‌ర్జెన్సీ కార‌ణంగా అశ్విన్ చెన్నైకి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఆ స‌మ‌యంలో త‌న త‌ల్లి చెప్పిన మాట‌ల‌ను అశ్విన్ గుర్తు చేసుకున్నాడు.

Ashwin Wife : ఆంటీ కుప్ప‌కూలిపోయింది.. వెంట‌నే పుజారాకు కాల్ చేశా.. రాజ్‌కోట్ టెస్ట్ ఎమ‌ర్జెన్సీని వివ‌రించిన అశ్విన్ భార్య

బ్లాక్ ఔట్ కార‌ణంగా ఆస్ప‌త్రిలో చేరింద‌ని చెప్పాడు. తాను ఆస్ప‌త్రికి వెళ్లే స‌రికి అమ్మ స్పృహ‌లో లేద‌న్నాడు. ఆమె త‌న‌ను మొద‌ట‌గా చూసిన‌ప్పుడు ఎందుకు వ‌చ్చావు అని అడిగింద‌ని తెలిపాడు. ఆ త‌రువాత మ‌ళ్లీ ఆమె నిద్ర‌లోకి జారుకుంద‌న్నాడు. మెల‌కువ‌ రాగానే టెస్టు మ్యాచ్ జ‌రుగుతోంది గ‌దా ఎందుకు వ‌చ్చావు. వెన‌క్కి వెళ్లాల‌ని అని చెప్పిన‌ట్లు అశ్విన్ గుర్తు చేసుకున్నాడు.

త‌న కుటుంబం అందించిన మ‌ద్ద‌తునే తాను వంద టెస్టులు ఆడుతున్నాన‌ని అశ్విన్ చెప్పాడు. ‘నా కెరీర్‌ను సులభతరం చేసేందుకు కుటుంబమంతా క్రికెట్‌పై ఆధారపడి ఉంది. ఇది సులభం కాదు. ఇది వారికి చాలా కష్టమైంది. ఇది వారికి పెద్ద రోలర్-కోస్టర్.’ అని అశ్విన్ తెలిపాడు.

అశ్విన్ కంటే ముందు..

అశ్విన్ కంటే ముందు 13 మంది ఆట‌గాళ్లు టీమ్ఇండియా త‌రుపున వంద టెస్టు మ్యాచ్‌లు ఆడారు. వీరిలో స‌చిన్ టెండూల్క‌ర్ అత్య‌ధికంగా 200 టెస్టులు ఆడాడు.

సచిన్ టెండూల్కర్ – 200 టెస్టులు
రాహుల్ ద్రవిడ్ – 163
వీవీఎస్ లక్ష్మణ్ – 134
అనిల్ కుంబ్లే – 132
కపిల్ దేవ్ – 131
సునీల్ గవాస్కర్ – 125
దిలీప్ వెంగ్‌సర్కార్ – 116
సౌరవ్ గంగూలీ – 113
విరాట్ కోహ్లి – 113
ఇషాంత్ శర్మ – 105
హర్భజన్ సింగ్ – 103
చెతేశ్వర్ పుజారా -103
వీరేంద్ర సెహ్వాగ్ – 103