×
Ad

Sikandar Raza : జింబాబ్వే కెప్టెన్ సికింద‌ర్ రజా అరుదైన ఘ‌న‌త‌..

జింబాబ్వే కెప్టెన్ సికింద‌ర్ రజా (Sikandar Raza) అరుదైన ఘ‌న‌త సాధించాడు.

Sikandar Raza creates history becoming the second cricketer to score over 3000 runs and take 100 T20I wickets

  • చ‌రిత్ర సృష్టించిన సికింద‌ర్ ర‌జా
  • అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో 3 ర‌న్స్‌తో పాటు 100 వికెట్లు తీసిన ఏకైక జింబాబ్వే ప్లేయ‌ర్‌
  • భార‌త్‌తో మ్యాచ్‌లో ఈ ఘ‌న‌త

Sikandar Raza : జింబాబ్వే కెప్టెన్ సికింద‌ర్ రజా అరుదైన ఘ‌న‌త సాధించాడు. అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో 3 వేలు ప‌రుగులు తీయ‌డంతో పాటు 100 వికెట్లు ప‌డ‌గొట్టిన తొలి జింబాబ్వే క్రికెటర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. గురువారం చెన్నైలోని చెపాక్ వేదిక‌గా భార‌త్‌తో మ్యాచ్‌లో 15 ప‌రుగుల వ్యక్తిగ‌త స్కోరు వ‌ద్ద అత‌డు ఈ ఘ‌న‌త సాధించాడు.

ఇక ఓవ‌రాల్‌గా అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో 3000 ప‌రుగులు 100 వికెట్లు తీసిన రెండో ప్లేయ‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కాడు. మలేషియా ఆట‌గాడు వీరన్‌దీప్ సింగ్ మాత్రమే ర‌జా క‌న్నా ముందు ఈ ఘ‌న‌త సాధించాడు. 26 ఏళ్ల ఈ మ‌లేషియా ఆటగాడు ఇప్ప‌టి వ‌ర‌కు 111 టీ20 మ్యాచ్‌ల్లో 109 వికెట్లతో పాటు 3180 పరుగులు చేశాడు. రజా 132 మ్యాచ్‌ల్లో 3016 పరుగులతో పాటు 104 వికెట్లు సాధించాడు.

Arshdeep Singh : చ‌రిత్ర సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్‌.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో ఏకైక భార‌త బౌల‌ర్‌

ఓవ‌రాల్‌గా 14వ ప్లేయ‌ర్..

ఇక జింబాబ్వే త‌రుపున టీ20 క్రికెట్‌లో 3000 ప‌రుగులు సాధించిన ఏకైక క్రికెట‌ర్ కూడా ర‌జానే కావ‌డం విశేషం. ఇక ఓవ‌రాల్‌గా అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 3వేల ప‌రుగులు చేసిన 14వ ఆట‌గాడిగా నిలిచాడు. బాబర్ అజామ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జోస్ బట్లర్, పాల్ స్టిర్లింగ్, మార్టిన్ గుప్టిల్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం, డేవిడ్ వార్నర్, సూర్యకుమార్ యాదవ్, వీరన్‌దీప్ సింగ్, ఆరోన్ ఫించ్, క్వింటన్ డికాక్ లు మాత్ర‌మే ర‌జా క‌న్నా ముందు అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో 3 వేల ప‌రుగుల మైలురాయిని పూర్తి చేసుకున్నారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట‌ బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 256 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో అభిషేక్ శ‌ర్మ (55; 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స‌ర్లు), హార్దిక్ పాండ్యా (50నాటౌట్‌; 23 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీలు బాదారు. జింబాబ్వే బౌల‌ర్ల‌లో రిచర్డ్ నగరావ, బ్లెస్సింగ్ ముజారబానీ, టినోటెండా మాపోసా, సికందర్ రజాలు త‌లా ఓ వికెట్ తీశారు.

IND vs ZIM : ఓట‌మికి సాకులు చెప్ప‌డం లేదు.. ఆ ఒక్క ప‌ని చేసి ఉంటే గెలిచేవాళ్లం.. జింబాబ్వే కెప్టెన్ సికింద‌ర్ రజా కామెంట్స్‌..

అనంత‌రం 257 ప‌రుగుల భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో జింబాబ్వే నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 184 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. బ్రియాన్ బెన్నెట్ (97 నాటౌట్; 59 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) తృటిలో శ‌త‌కాన్ని చేజార్చుకున్నాడు. సికింద‌ర్ ర‌జా (31 ;21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) రాణించాడు. భార‌త‌ బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు తీశాడు. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, అక్ష‌ర్ ప‌టేల్‌, శివ‌మ్ దూబె లు త‌లా ఓ వికెట్ సాధించారు.