Smriti Mandhana : చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. మహిళల క్రికెట్‌లో ఏకైక ప్లేయర్..
టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన (Smriti Mandhana) చరిత్ర సృష్టించింది.
- Thota Vamshi Kumar
- Updated on- September 22, 2026 / 12:51 PM IST
Smriti Mandhana creates history becomes first woman to score 11000 international runs
Smriti Mandhana : టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో 11వేల పరుగుల మైలురాయిని చేరుకుంది. ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. ఆసియా క్రీడలు 2026లో భాగంగా శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్‌లో స్మృతి మంధాన ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆమె వ్యక్తిగత స్కోరు 13 పరుగుల వద్ద దీన్ని అందుకుంది. కాగా.. ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన అద్భుతంగా ఆడింది. 45 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 79 పరుగులు సాధించింది.
𝗙𝗜𝗥𝗦𝗧 𝗪𝗢𝗠𝗔𝗡 𝗧𝗢 𝗦𝗖𝗢𝗥𝗘 1️⃣1️⃣,0️⃣0️⃣0️⃣ 𝗜𝗡𝗧𝗘𝗥𝗡𝗔𝗧𝗜𝗢𝗡𝗔𝗟 𝗥𝗨𝗡𝗦 🌟
Smriti Mandhana with another magnificent milestone to her name 🫡
Updates ▶️ https://t.co/x367kJHmrc#TeamIndia | #AsianGames pic.twitter.com/QJ3B4hYXYh
— BCCI Women (@BCCIWomen) September 22, 2026
2013లో స్మృతి మంధాన అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టింది. ఇప్పటి వరకు భారత్ తరుపున 9 టెస్టులు, 120 వన్డేలు, 179 టీ20 మ్యాచ్‌లు ఆడింది. టెస్టుల్లో 788 పరుగులు చేసింది. ఇందులో రెండు సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో 5411 పరుగులు చేసింది. ఇందులో 14 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక టీ20ల్లో 4867 చేసింది. ఇందులో రెండు సెంచరీలు, 37 అర్థశతకాలు ఉన్నాయి.
అంతేకాదండోయ్.. మహిళల అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక భాగస్వామ్య పరుగులు చేసిన జోడీగా స్మృతి మంధాన, షఫాలీ వర్మ ప్రపంచ రికార్డు సాధించారు. ఈ జోడీ 4 వేలకు పైగా పరుగులను సాధించారు.
They truly enjoy batting together 😌
Smriti Mandhana and Shafali Verma with another impressive record in the bag 🔥
Scorecard ▶️ https://t.co/x367kJHmrc#TeamIndia | #AsianGames pic.twitter.com/kKCIDeLSou
— BCCI Women (@BCCIWomen) September 22, 2026
