×
Ad

Smriti Mandhana : ఆస్ప‌త్రి నుంచి స్మృతి మంధాన తండ్రి డిశ్చార్జ్‌.. పెళ్లి ఎప్పుడంటే..?

భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్ స్మృతి మంధాన (Smriti Mandhana) తండ్రి శ్రీనివాస్ ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

Smriti Mandhana Father Discharged Report

Smriti Mandhana : భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్ స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇది మంధాన కుటుంబానికి పెద్ద ఉప‌శ‌మ‌నం క‌లిగించే విష‌యం అని చెప్ప‌వ‌చ్చు. నవంబ‌ర్ 23న‌ గుండెపోటు ల‌క్ష‌ణాల‌తో ఆయ‌న ఆస్ప‌త్రిలో చేశారు. దీంతో స్మృతి, ఆమె కాబోయే వరుడు పలాష్ ముచ్చల్ ఆదివారం జరగాల్సిన వారి వివాహ వేడుకను వాయిదా వేశారు.

కాగా.. స్మృతి తండ్రి ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయిన‌ప్ప‌టికి కూడా ఇప్ప‌టి వ‌ర‌కు వివాహ‌తేదీ గురించి కుటుంబం ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని నివేదిక‌లు సూచిస్తున్నాయి.

మ‌రోసారి ఆస్ప‌త్రిలో చేరిన ప‌లాష్ ముచ్చ‌ల్‌..

ఇదిలా ఉంటే.. మంగ‌ళ‌వారం అస్వ‌స్థ‌త‌కు గురికావ‌డంతో ప‌లాష్ ముచ్చ‌ల్ ను మ‌రోసారి ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు అత‌డి టీమ్ తెలిపింది. అత‌డికి ముంబైలోని గోరేగావ్‌లోని ఎస్‌వీఆర్ చికిత్స అందిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. ఫొటో షూట్‌ల కోసం వరుస ప్రయాణాలు, కొన్ని రోజులుగా సంగీత్‌, వివిధ కార్యక్రమాల్లో నృత్యాలు చేస్తుండడం, సరైన నిద్ర లేకపోవడం వంటి కారణాల వల్ల అత‌డు ఒత్తిడికి లోనై అస్వస్థతకు గురైనట్లు చెప్పింది.

Palash Muchhal : పలాష్‌ ముచ్చల్‌ తల్లి కీల‌క వ్యాఖ్య‌లు.. కాబోయే కోడ‌లు కాదు.. కొడుకే పెళ్లి ఆపేశాడు.. 4 గంట‌లు ఆస్ప‌త్రిలోనే..

కాగా.. ఆదివారం కూడా పలాష్‌ అనారోగ్యానికి గురిఅయిన సంగ‌తి తెలిసిందే. ఇన్ఫెక్షన్‌, ఎసిడిటీతో బాధ పడటంతో ఆస్పత్రిలో చేరిన అతడు చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యాడు. అయితే..మంగళవారం మరోసారి అస్వస్థతకు గురయ్యాడు.

మోసం చేశాడా?

అభిమానులను కలవరపెడుతున్న విషయం ఏమిటంటే స్మృతి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి ప్రీ-వెడ్డింగ్ వేడుకల ఫోటోలు, వీడియోలన్నింటినీ తొల‌గించింది. జెమిమా రోడ్రిగ్స్, ఆమె స‌హ‌చ‌ర ప్లేయ‌ర్లు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసిన మంధాన ప్రీ వెడ్డింగ్ వేడుక‌ల సంబంధించిన వీడియోలను తొల‌గించారు.

ఇక ఇదే స‌మ‌యంలో స్మృతి మంధాన‌ను ప‌లాష్ ముచ్చ‌ల్ మోసం చేశాడ‌ని, మ‌రో అమ్మాయితో చాటింగ్ చేసిన‌ట్లుగా సోష‌ల్ మీడియాలో ప‌లు స్ర్కీన్ షాట్లు వైర‌ల్ అవుతున్నాయి. దీనిపై ఇంత వ‌ర‌కు ప‌లాష్ గానీ, అత‌డి టీమ్ గానీ స్పందించ‌లేదు.

Smriti Mandhana : స్మృతి మంధానను ప‌లాష్ ముచ్చ‌ల్ మోసం చేశాడా? మ‌రో అమ్మాయితో చాటింగ్‌? అందుక‌నే పెళ్లి ఆగిపోయిందా? సోష‌ల్ మీడియాలో ర‌చ్చ ర‌చ్చ‌..!

ప‌లాష్ మోసం చేయ‌డంతోనే స్మృతి వీడియోలను తొల‌గించింద‌ని కొంద‌రు నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. అస‌లు నిజం ఏంటి అనేది స్మృతి మంధాన గానీ, ప‌లాష్ ముచ్చ‌ల్ గానీ స్పందిస్తేనే తెలుస్తుంది.