Smriti Mandhana : స్మృతి మంధానను ప‌లాష్ ముచ్చ‌ల్ మోసం చేశాడా? మ‌రో అమ్మాయితో చాటింగ్‌? అందుక‌నే పెళ్లి ఆగిపోయిందా? సోష‌ల్ మీడియాలో ర‌చ్చ ర‌చ్చ‌..!

భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) మ్యూజిక్‌ డైరెక్టర్‌ పలాష్ ముచ్చల్‌ వివాహం వాయిదా పడిన సంగ‌తి తెలిసిందే.

Smriti Mandhana : స్మృతి మంధానను ప‌లాష్ ముచ్చ‌ల్ మోసం చేశాడా? మ‌రో అమ్మాయితో చాటింగ్‌? అందుక‌నే పెళ్లి ఆగిపోయిందా? సోష‌ల్ మీడియాలో ర‌చ్చ ర‌చ్చ‌..!

Is Palash Muchhal cheating Smriti Mandhana Viral Screenshot sparks Controversy

Updated On : November 25, 2025 / 6:08 PM IST

Smriti Mandhana : భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూజిక్‌ డైరెక్టర్‌ పలాష్ ముచ్చల్‌ వివాహం వాయిదా పడిన సంగ‌తి తెలిసిందే. వాస్త‌వానికి ఆదివారం (న‌వంబ‌ర్ 23) వీరి వివాహం అంగ‌రంగ‌వైభ‌వంగా జ‌ర‌గాల్సి ఉంది. అయితే.. వివాహ వేడుక‌ల్లో పాల్గొన్న స్మృతి మంధాన తండ్రి గుండెపోటు ల‌క్ష‌ణాల‌తో ఇబ్బంది ప‌డడంతో ఆయ‌న్ను వెంట‌నే సాంగ్లీలోని ఓ ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. తండ్రి చూడ‌ని వేడుక త‌న‌కు వ‌ద్దంటూ స్మృతి మంధాన పెళ్లిని వాయిదా వేసిన‌ట్లుగా ఆమె మేనేజ‌ర్ తెలిపారు.

మ‌రోవైపు స్మృతి మంధాన‌కు కాబోయే భ‌ర్త ప‌లాష్ ముచ్చ‌ల్ సైతం అనారోగ్యానికి గురైయ్యాడు. వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌, ఎసిడిటీతో అతడు ముంబైలోని గోరేగావ్‌ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందిన‌ట్లుగా వార్తలు వ‌చ్చాయి. అయితే.. తాజాగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఓ వార్త సంచ‌ల‌నం రేపుతోంది.

Rahul Sipligunj : సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కాబోయే భార్య‌తో చాహ‌ల్‌.. పిక్ వైర‌ల్‌

ఇక‌ పెళ్లి వాయిదా ప‌డిన త‌రువాత వివాహ వేడుక‌కు సంబంధించిన అన్ని పోస్టుల‌ను స్మృతి మంధాన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి తొల‌గించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ నేప‌థ్యంలో స్మృతి మంధాన‌ను ప‌లాష్ ముచ్చ‌ల్ మోసం చేశాడ‌నే చ‌ర్చ సోష‌ల్ మీడియాలో మొద‌లైంది.

రెడిట్ స్క్రీన్‌షాట్‌లు వైర‌ల్‌..

మేరీ డి’కోస్టా అనే ఇన్‌స్టాగ్రామ్ యూజ‌ర్ రెడిట్‌లో కొన్ని స్ర్కీన్ షాట్‌ల‌ను షేర్ చేసింది. ఆమె ప‌లాష్ ముచ్చ‌ల్‌తో చాటింగ్ చేసిన‌ట్లుగా వెల్ల‌డించింది. ఇది మే 2025 నాటివి అని తెలిపింది. ఇందులో ప‌లాష్‌.. ఆమెను స్విమ్మింగ్ కు ఆహ్వానించ‌డం కనిపిస్తుంది. అత‌డి రిలేష‌న్ షిప్ స్టేట‌స్ గురించి తెలుసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించిన‌ప్పుడు అత‌డు ఆ ప్ర‌శ్న‌ల‌ను దాట‌వేసిన‌ట్లుగా క‌నిపించింది.

స్ర్కీన్ షాట్‌లను షేర్ చేసిన కాసేటి త‌రువాత ఆ అకౌంట్ డీయాక్టివేట్ అయింది. అయితే.. అప్ప‌టికే ఆ స్క్రీన్ షాట్‌లు మాత్రం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. దీనిపై నెటిజ‌న్లు రెండుగా విడిపోయారు. కొంద‌రు స్మృతి మద్ద‌తుగా కామెంట్లు చేస్తుండ‌గా మ‌రికొంద‌రు మాత్రం ప‌లాష్ అలా చేసి ఉండ‌డ‌ని అంటున్నారు. ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. స్మృతిగానీ, ప‌లాష్ గానీ స్పందిస్తేనే అస‌లు నిజం ఏంటో తెలుస్తుంది.

Palash Muchhal : పలాష్‌ ముచ్చల్‌ తల్లి కీల‌క వ్యాఖ్య‌లు.. కాబోయే కోడ‌లు కాదు.. కొడుకే పెళ్లి ఆపేశాడు.. 4 గంట‌లు ఆస్ప‌త్రిలోనే..

ఇదిలా ఉంటే.. స్మృతి మంధాన ఇప్పటికే తన సోషల్ మీడియా అకౌంట్ల‌లో నిశ్చితార్థం, ప్రపోజల్ వీడియోలు క‌నిపించ‌డం లేదు. ఆమె వాటిని డిలీట్ చేసి ఉండ‌వ‌చ్చు. లేదంటే ప్ర‌వేట్‌లో పెట్టుకుని ఉండ‌వ‌చ్చు. ఇంకోవైపు స్మృతి మంధాన ఫ్రెండ్‌, స‌హ‌చ‌ర క్రీడాకారిణి జెమీమా సైతం త‌న ఇన్‌స్టాలో స్మృతి పెళ్లికి సంబంధించిన వీడియోల‌ను తొల‌గించ‌డం గ‌మ‌నార్హం. కాగా.. పలాష్ మాత్రం ప్ర‌పొజ్ వీడియోతో పాటు అన్ని పోస్టుల‌ను అలాగే ఉంచాడు.