RCB Womens : ఆర్సీబీ ఉమెన్స్ టీం విన్.. మెన్స్ టీంపై సోషల్ మీడియా ట్రోల్స్..
ఆర్సీబీ ఉమెన్స్ టీం ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్నప్పటికీ ఫ్యాన్స్ కి ఆనందం లేకుండా పోతుంది. విన్ అయినా, కాకపోయినా ట్రోల్స్ తప్పడంలేదు.
- gum 95921
- Updated on- March 18, 2024 / 10:52 AM IST
Social media trolls and memes on RCB mens team due to womens team winning ipl trophy
RCB Womens : ‘ఆర్సీబీ’కి ట్రోఫీ రావడం అనేది ఐపీఎల్ చరిత్రలో ఒక తీరని కలలా మిగిలిపోతుంది అనుకున్న విషయం. కానీ ఆ కలని ఆర్సీబీ ఉమెన్స్ టీం నిజం చేసింది. లక్షలాది మంది ఫ్యాన్స్ కోరికను నిజం చేస్తూ.. నిన్న జరిగిన ఫైనల్స్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై ఆర్సీబీ ఘన విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకున్నారు. కానీ ఆర్సీబీ వాళ్ళకి మాత్రం ట్రోల్స్ తప్పడం లేదు.
అయితే ఈ ట్రోల్స్.. ట్రోఫీ సాధించిన ఉమెన్స్ టీం పై కాదు, ఇప్పటివరకు ట్రోఫీని లిఫ్ట్ చేయలేకపోయిన మెన్స్ టీంని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆడేసుకుంటుంటారు. ఎన్నో ఏళ్లగా మెన్స్ టీం ట్రోఫీ కోసం కష్టపడుతుంటే.. ఉమెన్స్ టీం కేవలం రెండేళ్లలోనే ఆ కలని నిజం చేసిందంటూ మెన్స్ టీంని ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ ట్రోల్స్ చూసిన ఆర్సీబీ ఫ్యాన్స్.. మమ్మల్ని ఇలా కూడా వదలరా అంటూ బాధ పడుతున్నారు. మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ట్రోల్స్, మీమ్స్ వైపు ఓ లుక్ వేసేయండి.
Also read : Jagapathi Babu : జగపతిబాబు యాక్టర్ కాకపోయుంటే.. ఏమయ్యేవారో తెలుసా..!
