Jagapathi Babu : జగపతిబాబు యాక్టర్ కాకపోయుంటే.. ఏమయ్యేవారో తెలుసా..!

జగపతిబాబు యాక్టర్ కాకపోయుంటే ఆ ప్రొఫిషన్ లో ఉండేవారట. అదేంటో తెలుసా..?

Jagapathi Babu : జగపతిబాబు యాక్టర్ కాకపోయుంటే.. ఏమయ్యేవారో తెలుసా..!

Jagapathi Babu choose that profession if he didnt become a actor

Updated On : March 18, 2024 / 7:09 AM IST

Jagapathi Babu : టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్ పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్ రోల్స్ ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇక ఈ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సినిమాల్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ ఉంటున్నారు. ఈక్రమంలోనే ట్విట్టర్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ లో జగ్గూభాయ్ వేసే పోస్టులకు నెటిజెన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

జగ్గూభాయ్ తన లైఫ్ స్టైల్‌కి సంబంధించిన విషయాలతో పాటు అప్పుడప్పుడు వేసే కొన్ని ఫన్నీ ట్వీట్స్ నెటిజెన్స్ నవ్విస్తూ ఉంటాయి. తాజాగా ఈ సీనియర్ నటుడు ఓ పోస్ట్ వేశారు. పోలీస్ గెటప్ లో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. “నేను సినిమాల్లోకి రాకపోయుంటే, కచ్చితంగా సూపర్ కాప్ అయ్యి ఉండేవాడిని. ఇప్పుడున్న సూపర్ కాప్స్ లాగా నేను లా అండ్ ఆర్డర్ ని గడగడలాడించేవాడిని. ఎం అంటారు” అంటూ రాసుకొచ్చారు.

Also read : Priyadarshi : ‘ఓం భీమ్ బుష్’ సినిమాపై.. ప్రియదర్శి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..

 

View this post on Instagram

 

A post shared by Jaggu Bhai (@iamjaggubhai_)

ఇక ఈ పోస్టు వైపు నెటిజెన్స్ రియాక్ట్ అవుతూ.. ‘ఏమంటాము జగ్గూభాయ్. తగ్గేదేలే అంటాము’ అంటూ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. కాగా ఈ పోలీస్ లుక్ బాలీవుడ్ మూవీ ‘రుసలాన్’కి సంబంధించింది. ఆ మూవీలో జగ్గూభాయ్ సూపర్ కాప్ గా తన యాక్షన్ చూపించబోతున్నారు. జగ్గూభాయ్ తన కెరీర్ లో ఇప్పటికే చాలాసార్లు పోలీస్ పాత్రలు చేసారు. హీరోగా ఉన్న సమయంలో పోలీస్ పాత్రలతో మంచి విజయాలనే అందుకున్నారు.

ఆ తరువాత సపోర్టింగ్ రోల్స్ కి వచ్చిన తరువాత కూడా పోలీస్ రోల్స్ లో మంచి సక్సెస్ రేట్ మెయిన్‌టైన్ చేస్తూ వస్తున్నారు. సూపర్ కాప్ అవ్వాలనే తన డ్రీమ్ ని సినిమాల్లో సక్సెస్ ఫుల్‌గా కనిపిస్తూ తీర్చుకుంటున్నారు. కాగా జగపతిబాబు ప్రస్తుతం టాలీవుడ్ టు బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ వస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అయిన సలార్ 2, పుష్ప 2, కంగువ సినిమాల్లో కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.