Priyadarshi : ‘ఓం భీమ్ బుష్’ సినిమాపై.. ప్రియదర్శి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..

ఓం భీమ్ బుష్ ప్రమోషన్స్ లో భాగంగా ప్రియదర్శి మీడియాతో ముచ్చటించారు.

Priyadarshi : ‘ఓం భీమ్ బుష్’ సినిమాపై.. ప్రియదర్శి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..

Priyadarshi Exclusive Interview about Om Bheem Bush Movie

Updated On : March 17, 2024 / 7:14 PM IST

Priyadarshi : ఓ పక్క కమెడియన్ గా సినిమాలు చేస్తూనే మరో పక్క మల్లేశం, బలగం.. లాంటి మంచి మంచి సినిమాలని ప్రేక్షకులకు అందిస్తున్నాడు ప్రియదర్శి. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ప్రియదర్శి త్వరలో శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణతో కలిసి ‘ఓం భీమ్ బుష్’ సినిమాతో రాబోతున్నాడు. హుషారు ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో ఫుల్ కామెడీగా తెరకెక్కిన ‘ఓం భీమ్ బుష్’ సినిమా మార్చ్ 22న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్స్ తో ప్రేక్షకులని నవ్వించారు చిత్రయూనిట్. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ప్రియదర్శి మీడియాతో ముచ్చటించారు. సినిమా గురించి, తన గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు.

మీరు ‘ఓం భీమ్ బుష్’ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు?

డైరెక్టర్ హర్ష హుషారు సినిమా నుంచే పరిచయం. అంతకుముందే హుషారు, రౌడీ బాయ్స్ సినిమాల్లో నేను చేయాల్సి ఉంది కానీ కుదరలేదు. ‘ఓం భీమ్ బుష్’ కథ చెప్పినప్పుడు నచ్చింది. శ్రీ విష్ణు, రాహుల్ తో అని చెప్పడంతో ఈ కథకి ఓకే చెప్పాను. ఈ కథలో మంచి ఇంట్రస్టింగ్ పాయింట్ ఉంది. దానికి ఫాంటసీ, హారర్ ఎలిమెంట్ జతచేయడం విశేషం.

ఓం భీమ్ బుష్ లో మీ పాత్ర ఎలా వుంటుంది ?

ఈ సినిమాలో నేను డా. వినయ్ గుమ్మడి పాత్ర పోషిస్తున్నాను. ఉస్మానియాలో పీహెచ్డీ చేసే బ్యాచ్. అక్కడ స్టయిఫండ్, ఉచిత హాస్టల్ సౌకర్యం కోసం చేరతాం. నేను సైన్స్ ని నమ్మితే మిగిలిన ఇద్దరు మంత్రాలు, తంత్రాలని నమ్ముతారు. మా ముగ్గురి మధ్య మంచి కామెడీ జనరేట్ అవుతుంది. ముగ్గురం కలసి బ్రోచేవారెవరురా చేశాం. దానికి ఓం భీమ్ బుష్ సినిమాకి పోలిక ఉండదు. ఈ సినిమాలో నాకు ఆయేషా ఖాన్ అనే హీరోయిన్ జోడిగా నటిస్తుంది. అలా అని మా మధ్య రొమాంటిక్ సాంగ్స్ ఏమీ ఉండవు.

ఇందులో కామెడీ ఎలా వుంటుంది ?

ఇది మంచి కామెడీ మూవీ. అడల్ట్ కామెడీ అనిపించదు. ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసేలా క్లీన్ గా సినిమా చేశాం.

మీ ముగ్గురు కలిసి చేసిన బ్రోచేవారెవరురా సినిమాకు ఈ సినిమా సీక్వెల్ అనుకోవచ్చా?

అస్సలు కాదు. ఎందుకంటే అందులో ముగ్గురం కొంచెం మెచ్యూర్డ్ పాత్రలు. అనుకోకుండా ఓ సమస్యలో ఇరుక్కుంటాం. కానీ ‘ఓం భీమ్ బుష్’ లో మేం కావాలని చేసే తింగరి పనుల వల్ల సమస్యలలో ఇరుక్కుంటాం. దానికి దీనికి చాలా తేడా ఉంది.

మంగళవారం సినిమాలో ఎలివేషన్స్ ఉండే హీరోగా చేశారు, ఆ తర్వాత అలా హీరోగా సినిమాలు వచ్చాయా?

హీరోగా కంటే కూడా నటుడిగా నన్ను నేను చూసుకోవడానికి ఇష్టపడతాను. హీరో అనగానే ఒక ఇమేజ్ వస్తుంది, దాన్ని కాపాడుకోవాలి. కానీ నటుడిగా ఉంటే చాలా స్వేఛ్చగా, నదిలా ప్రవహించవచ్చు. నటుడిగా ఉంటే వైవిధ్యమైన పాత్రలు చేయొచ్చు. అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మంగళవారంలో కూడా హీరో కాదు ఒక మంచి పాత్ర. నాకు ఇలాంటి మంచి పాత్రలు ఇస్తున్న రచయిత, దర్శకులు ఉండటం నా అదృష్టం.

సినిమాకి నిర్మాతల సహకారం ఎలా ఉంది?

సునీల్, వంశీ గారు సినిమాని గ్రాండ్ గా నిర్మించారు. యువీ ప్రొడక్షన్ అంటేనే ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంటాయి. ఈ సినిమాల కోసం భారీ మహల్ సెట్, ఫిల్మ్ సిటీలో ఒక సెట్, నిజం కాలేజీలో సెట్ వేశారు. పూణెకి వెళ్లి అక్కడ కూడా షూట్ చేసాము. ఇలా సినిమాకి కావాల్సిన ప్రతిది రాజీపడకుండా సమకూర్చారు. ఒక సాంగ్ రిచ్ గా, గ్రీక్ తరహా గెటప్స్ తో, లండన్ అమ్మాయిలతో ఉంటుంది. ఆ సాంగ్ కూడా చాలా రిచ్ గా వచ్చింది.

Also Read : Family Star : ఫ్యామిలీ స్టార్ షూటింగ్ ముగింపు.. ఫొటోలతో సందడి చేసిన టీం..

‘ఓం భీమ్ బుష్’ అనే టైటిల్ ఎందుకు పెట్టారు?

ముందు కథ అనుకున్నప్పుడు ఈ టైటిల్ అనుకోలేదు. షూటింగ్ చేస్తుండగా, మా ముగ్గురి మధ్య వుండే రాపోతో ఈనాటి ట్రెండ్ కు తగినట్లు మాట్లాడే భాషతో షడెన్ గా పుట్టిన టైటిల్ ‘ఓం భీమ్ బుష్’. ఇలాంటి పదం చిన్నప్పుడు మనం చాలాసార్లు విన్నాం. ఇప్పుడు మళ్ళీ క్యాచీగా ఉంటుందని పెట్టాం.

ప్రమోషన్స్ లో రెస్పాన్స్ ఎలా ఉంది?

నేను వైజాగ్ కు మాత్రం వేరే షూట్ లో ఉండడం వల్ల వెళ్ళలేకపోయాను. హైదరాబాద్ లో ట్రైలర్, మిగిలిన చోట్ల ప్రమోషన్స్ కి వెళ్ళాను. అద్భుతమైన రెస్సాన్స్ వచ్చింది. యూత్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ట్రైలర్, టీజర్స్ చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

Also Read : Tej Sapru : OG సినిమాలో పవన్ మూడు వేరియేషన్స్‌లో..? OG సినిమా గురించి విలన్ కామెంట్స్..

యూత్ సినిమాలలో డైలాగ్స్ కొంచెం అడల్ట్ గా ఉంటాయి? దీంట్లో కూడా అలాగే ఉంటుందా?

సహజంగా యూత్ బయట మాట్లాడుకునే మాటలే సహజత్వం కోసం సినిమా, కథపరంగా కొన్నిడైలాగ్స్ అలా వస్తుంటాయి. కానీ ఈ సినిమాలో అసభ్యత డైలాగ్స్ ఉండాయి.

మీ కెరీర్ లో ఇన్నాళ్లు మీలో ఏం మార్పులు వచ్చాయి?

పెళ్లిచూపులు సినిమా టైంలో టీనేజ్ లో ఉన్నాను. ఆ తర్వాత నా సినిమాలకు వస్తున్న రెస్సాన్స్ చూసి నాలో మార్పు వచ్చింది. అప్పటికి, ఇప్పటికి చాలా మారాను. బాధ్యతగా ఉంటున్నాను. కావాల్సినవి నేర్చుకొని, అక్కర్లేనివి వదిలేస్తున్నాను.

దర్శకుడు హర్ష గురించి చెప్పండి?

హర్ష నాకు 12 ఏళ్ళుగా తెలుసు. చాలా ట్యాలెంటెడ్ డైరెక్టర్. హుషారు సినిమా కూడా నేను చేయాలి కానీ కుదరలేదు. రౌడీబాయ్స్ లో కూడా చేయాలి, అదీ కుదరలేదు. ఇప్పుడు మూడోసారి కుదిరింది.

రాహుల్ రామక్రిష్ణ, శ్రీ విష్ణులతో మీ స్నేహం గురించి చెప్పండి?

రాహుల్ నాకు 12 ఏళ్ళుగా తెలుసు. శ్రీ విష్ణు ఒక్కటే జిందగీ సినిమా నుంచి తెలుసు. స్నేహితులతో కలసి సినిమా చేస్తున్నపుడు ప్రతి క్షణం మెమరబుల్ గా ఉంటుంది. మేము ముగ్గురం ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఎదిగిన వాళ్ళమే. ముగ్గురిలో మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉంది. మా కెరీర్ పెరుగుతూనే వచ్చింది. మేము ఇలా ఉన్నామంటే ఆడియన్స్ వల్లే. వాళ్ళకి కృతజ్ఞతలు.

నెక్స్ట్ రాబోయే సినిమాలు ?

లీడ్ రోల్ లో నభా నటేష్ తో ఓ సినిమా చేస్తున్నాను. షూటింగ్ జరుగుతోంది. గేమ్ ఛేంజర్ సినిమాలో కూడా నటిస్తున్నాను అని తెలిపాడు.

Priyadarshi Exclusive Interview about Om Bheem Bush Movie