Tej Sapru : OG సినిమాలో పవన్ మూడు వేరియేషన్స్‌లో..? OG సినిమా గురించి విలన్ కామెంట్స్..

బాలీవుడ్ నటుడు తేజ్ సప్రూ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో OG సినిమా గురించి మాట్లాడారు.

Tej Sapru : OG సినిమాలో పవన్ మూడు వేరియేషన్స్‌లో..? OG సినిమా గురించి విలన్ కామెంట్స్..

Bollywood Actor Tej Sapru Interesting Comments on Pawan Kalyan OG Movie

Updated On : March 17, 2024 / 3:49 PM IST

Tej Sapru : పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. ఎన్నికల డేట్స్ కూడా ప్రకటించారు. ఎన్నికల్లో బిజీగా ఉండటంతో పవన్ చేతిలో ఉన్న మూడు సినిమాలు పక్కన పెట్టేసారు. పవన్ డేట్స్ ఇవ్వకపోవడంతో ఆ సినిమా షూటింగ్స్ ఆగాయి. వాటిల్లో OG సినిమా ఒక్కటే ఎక్కువ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. కేవలం ఒక్క షెడ్యూల్ పవన్ ఉన్న సీన్స్ పెండింగ్ ఉన్నాయని సమాచారం.

ఇక OG సినిమాని సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తారని చిత్రయూనిట్ ఆల్రెడీ ప్రకటించారు. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ, శ్రియ రెడ్డి, అర్జున్ దాస్, ప్రియాంక మోహన్, తేజ్ సప్రూ.. ఇంకా పలువురు స్టార్స్ నటిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయగా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ నటుడు తేజ్ సప్రూ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో OG సినిమా గురించి మాట్లాడారు.

Also Read : Samantha : సింపతీ స్టార్ వ్యాఖ్యలపై సమంత ఏమందంటే?

తేజ్ సప్రూ ఇటీవలే రజాకార్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నెక్స్ట్ తెలుగులో OG సినిమా చేస్తున్నాను. సినిమా అద్భుతంగా ఉండబోతుంది. ఇందులో నేను విలన్ పాత్ర చేస్తున్నాను. ఇమ్రాన్ హష్మీ నా కొడుకు పాత్ర చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ యూనియన్ లీడర్, డాన్, పొలిటీషియన్ పాత్రల్లో కనిపిస్తాడు. సినిమా అదిరిపోతుంది అని తెలిపారు. దీంతో తేజ్ సప్రూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

పవన్ మూడు పాత్రల్లో.. అందులోను యూనియన్ లీడర్, డాన్, పొలిటీషియన్ పాత్రలు అనడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇక మార్చ్ 24 ఇమ్రాన్ హష్మీ పుట్టిన రోజున OG సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేస్తారని సమాచారం.