Samantha : సింపతీ స్టార్ వ్యాఖ్యలపై సమంత ఏమందంటే?
తాజాగా ఓ మీడియా కార్యక్రమంలో పాల్గొన్న సమంత పలు విషయాల గురించి మాట్లాడింది.

Samantha reacts on Sympathy Star Comments
Samantha : సమంత ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. హెల్త్ మీద ఫోకస్ చేయడానికి సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం సమంత తన ఆరోగ్యం చూసుకుంటూ, దేశ విదేశాలు తిరుగుతూ, పలు కార్యక్రమాల్లో పాల్గొంటుంది మాయోసైటిస్ నుంచి సమంత ఆల్రెడీ కోలుకున్నట్టు సమాచారం. త్వరలోనే ఆమె గతంలో నటించిన సిటాడెల్ సిరీస్ రాబోతుందని తెలుస్తుంది.
తాజాగా ఓ మీడియా కార్యక్రమంలో పాల్గొన్న సమంత పలు విషయాల గురించి మాట్లాడింది. అయితే యశోద, శాకుంతలం సినిమాల సమయంలో తన ఆరోగ్యం బాగోలేదు అని చెప్పినప్పుడు సినిమా ప్రమోషన్స్ కోసమే చెప్పింది, బయట బానే ఉంది, సింపతీ కోసం అలా చెప్తుంది అని ట్రోల్స్ వచ్చాయి. ఈ ట్రోల్స్ పై సమంత ఇప్పటిదాకా స్పందించలేదు.
Also Read : Manchu Vishnu : మోహన్ బాబు పుట్టిన రోజున ‘కన్నప్ప’ బుక్ లాంచ్.. అందరికి ఫ్రీగా ఇస్తాను అంటున్న మంచు విష్ణు..
తాజాగా మీడియా కార్యక్రమంలో సింపతీ స్టార్ వ్యాఖ్యలపై సమంత స్పందిస్తూ.. యశోద, శాకుంతలం సినిమాల సమయంలో నా హెల్త్ గురించి బయట పెట్టినందుకు సింపతీ కోసం అలా చేశాను అనుకున్నారు. ఆ సినిమాలు లేడీ ఓరియెంటెడ్ కాబట్టి ప్రచార భాద్యత నాపైనే ఉంది. సినిమాని కచ్చితంగా ప్రమోట్ చేయాలి. ఆ సమయంలో మీడియాలో బానే కనపడటంతో నేను అబద్దం చెప్పాను అనుకున్నారు. నాకు ఆరోగ్యం బాలేదని మీడియా ముందు నీరసంగా ఉండలేను కదా. దానిని తప్పుగా అర్ధం చేసుకొని సింపతీ అంటూ ప్రమోట్ చేసారు. నేను అనారోగ్యంతో పడ్డ ఇబ్బందులు అర్థంకాక నన్ను ట్రోల్ చేసారు. ఆ సమయంలో వాటి వల్ల ఒత్తిడికి గురయ్యాను. కానీ ఆ తర్వాత వాటిని పట్టించుకోవడం మర్చిపోయాను.
People Called Me "Sympathy Queen" When I revealed my condition during the promotions?
Internet is ?! They can make anyone feel bad about themselves#Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/zyCbNxmSKl
— Vishnu Writes (@VishnuWrites) March 17, 2024