Manchu Vishnu : మోహన్ బాబు పుట్టిన రోజున ‘కన్నప్ప’ బుక్ లాంచ్.. అందరికి ఫ్రీగా ఇస్తాను అంటున్న మంచు విష్ణు..
తాజాగా మంచు విష్ణు కన్నప్ప గురించి ఓ ఆసక్తికర ప్రకటన చేస్తూ వీడియోని రిలీజ్ చేసారు.

Manchu Vishnu Releasing Kannappa Comic Book on Mohan Babu Birthday
Manchu Vishnu : మంచు విష్ణు ‘కన్నప్ప'(Kannappa) అనే పాన్ ఇండియా సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. తన సొంత నిర్మాణంలో భారీగా 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ షూట్ పూర్తవ్వగా ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూట్ జరుగుతుంది. న్యూజిలాండ్ అడవుల్లో కన్నప్ప సినిమా షూట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో మధుబాల, ప్రభాస్, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్.. ఇలా చాలామంది అన్ని పరిశ్రమల స్టార్స్ నటిస్తున్నారు.
ఇటీవలే కన్నప్ప ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. తాజాగా మంచు విష్ణు కన్నప్ప గురించి ఓ ఆసక్తికర ప్రకటన చేస్తూ ఓ వీడియోని రిలీజ్ చేసారు. ఈ వీడియోలో మంచు విష్ణు మాట్లాడుతూ.. కన్నప్ప సినిమా గురించి, ఆయన ఎవరు, అతని చరిత్ర ఏంటి అని వేరే పరిశ్రమల వాళ్ళు నన్ను చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. అందుకే వాళ్ళందరి కోసం కన్నప్ప చరిత్ర, శ్రీకాళహస్తి చరిత్ర తెలిపేలా కన్నప్ప పేరుతో ఓ కామిక్ బుక్ రిలీజ్ చేయబోతున్నాను. అమర్ చిత్ర కథ సహాయంతో కన్నప్ప కామిక్ బుక్ ని మా నాన్న పుట్టిన రోజు మార్చ్ 19న రిలీజ్ చేయబోతున్నాను. ఈ పుస్తకం కావాల్సిన వాళ్ళు నా ఇన్‌స్టాగ్రామ్ కి మెసేజ్ చేయండి. నా టీం మిమ్మల్ని కాంటాక్ట్ అయి మీకు పుస్తకం పంపిస్తారు. దీనికి ఎలాంటి డబ్బులు కట్టనవసరం లేదు. ఈ బుక్ అందరికి ఫ్రీగా ఇస్తున్నాను. ఎందుకంటే కన్నప్ప చరిత్రని అందరికి తెలియచేయాలి అని తెలిపారు విష్ణు.
దీంతో విష్ణు షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది. కన్నప్ప లాంటి భారీ సినిమాని తీయడమే కాకుండా మన కన్నప్ప చరిత్రని దేశమంతటా తెలిసేలా బుక్ రిలీజ్ చేయడం, ఆ బుక్ ఫ్రీగా ఇస్తాను అని చెప్పడంతో మంచు విష్ణుని అంతా అభినందిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీకు కూడా కన్నప్ప కామిక్ బుక్ కావాలంటే మంచు విష్ణు ఇన్‌స్టాగ్రామ్ కి మెసేజ్ చేసేయండి.