IPL tickets : బ్లాక్‌లో ఐపీఎల్ టికెట్లు అమ్ముతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అరెస్ట్..
ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లను బ్లాక్‌లో అమ్ముతున్న ముగ్గురు సాఫ్ట్‌వేరు ఉద్యోగులను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు.
- Thota Vamshi Kumar
- Published On : April 19, 2024 / 03:13 PM IST
Software employees selling IPL tickets in block arrested
IPL tickets 2024 : ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లను బ్లాక్‌లో అమ్ముతున్న ముగ్గురు సాఫ్ట్‌వేరు ఉద్యోగులను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌కు సంబంధించిన 15 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు.
కొండాపూర్ ప్రాంతంలో ఐపీఎల్ టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నారు అన్న పక్కా సమాచారంతో అక్కడకు చేరుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ముగ్గురు యువకులు మధుబాబు, మాథ్యూ రోడ్రిక్స్, నిజంతన్ ఎలంగోవన్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఒక్కో టికెట్‌ను రూ.10 వేల నుంచి రూ.15వేల వరకు విక్రయిస్తున్నట్లుగా తెలుస్తోంది. వీరి వద్ద నుంచి మూడు ఫోన్లు, 15 టికెట్లను స్వాధీనం చేసుకున్న మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదిలా ఉంటే.. మే 8న ఉప్పల్ స్టేడియంలో జరగనున్ మ్యాచ్ టికెట్ల బుకింగ్‌లు పేటిఎంలో ఓపెన్ అయ్యాయి. మిగిలిన మ్యాచులతో పోలిస్తే ఈ మ్యాచ్ టికెట్ల రేటు తక్కువగానే ఉంది. మే 8న లక్నో సూపర్ జెయింట్స్‌తో సన్‌రైజర్స్ హైదారబాద్ తలపడనుంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు హైదరాబాద్ జట్టు ఆరు మ్యాచులు ఆడింది. ఇందులో నాలుగు మ్యాచుల్లో గెలిచింది. రెండింటిలో ఓడిపోయింది. 8 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.
