Sourav Ganguly : ఐపీఎల్ 2027 సీజ‌న్‌కు ముందు ఢిల్లీ క్యాపిట‌ల్స్ కీల‌క నిర్ణ‌యం.. హెడ్ కోచ్‌గా సౌర‌వ్ గంగూలీ

ఢిల్లీ క్యాపిట‌ల్స్ హెడ్ కోచ్‌గా సౌర‌వ్ గంగూలీ (Sourav Ganguly ) నియ‌మితుల‌య్యాడు.

Sourav Ganguly appointed as Delhi Capitals head coach

Sourav Ganguly : ఐపీఎల్ 2027 సీజ‌న్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ జ‌ట్టు కొత్త హెడ్ కోచ్‌గా సౌర‌వ్ గంగూలీని నియ‌మించుకుంది. గత రెండు సీజన్లుగా ఈ పదవిలో ఉన్న హేమాంగ్ బదానీ స్థానంలో భారత మాజీ కెప్టెన్ గంగూలీ బాధ్యతలు స్వీకరించారు.

2019లో సలహాదారుడిగా చేరినప్పటి నుండి ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీతో గంగూలీ అనుబంధం కలిగి ఉన్నారు. బీసీసీఐ అధ్యక్షుడిగా తన పదవీకాలం తర్వాత ఆయన.. ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ పురుషుల, మహిళల జట్లు రెండింటికీ క్రికెట్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఇటీవల సౌతాఫ్రికా టీ20 టోర్నీలో ప్రిటోరియా క్యాపిటల్స్‌కు హెడ్‌ కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టి.. ఈ ఏడాది ప్రారంభంలో వారిని SA20 ఫైనల్‌కు నడిపించారు.

Tilak Varma : వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌.. తెలుగు తేజం తిల‌క్ వ‌ర్మ‌ను ఊరిస్తున్న రికార్డు ఇదే..

ఇక త‌న‌ను హెడ్ కోచ్‌గా నియ‌మించ‌డం ప‌ట్ల గంగూలీ ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు. ‘ఐపీఎల్‌లో హెడ్ కోచ్ పాత్రను చేపట్టడానికి నేను ఎదురుచూస్తున్నాను. ఢిల్లీ క్యాపిటల్స్ నాకు చాలా ఇష్టమైన ఫ్రాంచైజీ. ఎన్నో ఏళ్లుగా ఫ్రాంచైజీతో నాకు బలమైన సంబంధం ఉంది. జ‌ట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్ల ఉన్నారు. ఇటీవలి కాలంలో మేము మంచి క్రికెట్ ఆడాము. కొత్త సీజ‌న్‌లో జ‌ట్టు అద్భుతంగా రాణించేందుకు నా వంతు ప్ర‌య‌త్నం నేను చేస్తాను.’ అని గంగూలీ అన్నాడు.

Sanju Samson : వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌.. సంజూ శాంస‌న్‌ను ఊరిస్తున్న అరుదైన మైలురాయి..

ఐపీఎల్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు టైటిల్ గెల‌వ‌ని జ‌ట్ల‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఒక‌టి. 2020లో ఫైన‌ల్‌కు చేరినా తృటిలో క‌ప్పు చేజారింది. 2021 నుంచి ఆ జ‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క సారి కూడా ప్లేఆఫ్స్‌కు సైతం అర్హ‌త సాధించ‌లేదు. ఇప్పుడు గంగూలీ మార్గ నిర్దేశ్యంలో ఆ జ‌ట్టు తొలిసారి క‌ప్పును ముద్దాడాల‌ని ఆరాట‌ప‌డుతోంది. గ‌త ఏడాది (ఐపీఎల్ 2026) సీజ‌న్‌లో అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ జ‌ట్టు ఆరో స్థానంతో స‌రిపెట్టుకుంది.