Sourav Ganguly Birthday: సౌరబ్ గంగూలీ ఇంటికెళ్లి బర్త్‌డే విషెస్ చెప్పిన దీదీ

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సౌరవ్ గంగూలీని కోల్‌కతాలోని తన నివాసంలో కలుసుకున్నారు. భారత మాజీ కెప్టెన్ 49వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు మమతా శుభాకాంక్షలు తెలిపారు.

Sourav Ganguly Birthday : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సౌరవ్ గంగూలీని కోల్‌కతాలోని తన నివాసంలో కలుసుకున్నారు. భారత మాజీ కెప్టెన్ 49వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు మమతా శుభాకాంక్షలు తెలిపారు. మాజీ భారత కెప్టెన్ నివాసానికి చేరుకున్న తర్వాత సౌరవ్ గంగూలీకి మధ్యాహ్నం పూల గుత్తి అందజేశారు. సీఎం మమత గంగూలీని తన నివాసంలో సందర్శించడం ఇదే మొదటిసారి. గంగూలీతో స్నేహపూర్వక సంబంధం కలిగిన సీఎం మమతా అతడిపై ప్రశంసలు కురిపించారు. ప్రతి ఏడాది మమతా సౌరవ్ పుట్టినరోజున శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు. కానీ, సౌరవ్ నివాసాన్ని సీఎం మమత సందర్శించడం ఇది మొదటిసారి.

మమతా సౌరవ్ గంగూలీ, అతని కుటుంబ సభ్యులతో దాదాపు 45 నిమిషాలు గడిపారు. అంతకుముందు రోజు, అభిమానులు తన 49వ పుట్టినరోజు సందర్భంగా గంగూలీ నివాసం వద్దకు చేరుకుని అతడికి శుభాకాంక్షలు తెలియజేశారు. స్నేహితుడు సచిన్ టెండూల్కర్ కూడా గంగూలీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గతేడాది బెంగాల్ క్రికెటర్ గుండె జబ్బు నుంచి కోలుకున్నాడు. నా ప్రియమైన దాదికి  పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు ఆరోగ్యకరమైన సంతోషకరమైన సంవత్సరం కావాలని కోరుకుంటున్నానని టెండూల్కర్ అన్నాడు. వీరేందర్ సెహ్వాగ్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్ కూడా బర్త్ డే విషెస్ తెలియజేశారు.

సౌరవ్ గంగూలీ ప్రస్తుతం BCCI అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నాడు. 2003లో ప్రపంచ కప్ ఫైనల్‌కు సారధ్యం వహించిన మాజీ భారత కెప్టెన్.. 2008లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. భారత్ తరపున టెస్టులు, వన్డేల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా నిలిచాడు. భారతదేశం తరఫున 113 టెస్టులు, 311 వన్డేలు ఆడాడు. 18,000 పరుగులు సాధించాడు 38 సెంచరీలు నమోదు చేశాడు.


గంగూలీ 5 ఏళ్లు జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. గంగూలీ సారధ్యంలో అనేక మంది క్రికెటర్లు విజయాలు సాధించారు. వీరేందర్ సెహ్వాగ్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ వంటి క్రికెటర్లు తమ కెరీర్‌లో ‘దాదా’ను ఆదర్శంగా భావించేవారు. వాస్తవానికి, ఎంఎస్ ధోని 2004లో గంగూలీ కెప్టెన్సీలోనే జట్టులోకి అడుగుపెట్టాడు.

ట్రెండింగ్ వార్తలు