ODI World Cup 2023 : సెమీ ఫైనల్‌కు ముందు దక్షిణాఫ్రికాకు బిగ్ షాక్..! తప్పని తిప్పలు..!
ODI World Cup : వన్డే ప్రపంచకప్ 2023లో దక్షిణాఫ్రికా అదరగొడుతోంది. వరుస విజయాలతో సెమీస్ కు చేరుకుంది.
- Thota Vamshi Kumar
- Published On : November 12, 2023 / 02:56 PM IST
South Africa
వన్డే ప్రపంచకప్ 2023లో దక్షిణాఫ్రికా అదరగొడుతోంది. వరుస విజయాలతో సెమీస్ కు చేరుకుంది. సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ క్రమంలో సఫారీ జట్టుకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు కెప్టెన్ టెంబా బావుమా తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. దీంతో అతడు సెమీ ఫైనల్ మ్యాచ్ కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే సెమీస్‌లో సౌతాఫ్రికాకు ఇబ్బందులు తప్పవు.
లీగ్ దశలో దక్షిణాఫ్రికా తన చివరి మ్యాచ్‌ను అఫ్గానిస్థాన్‌తో ఆడింది. ఈ మ్యాచ్‌లో బావుమా కు తొడ కండరాలు పట్టేశాయి. దీంతో అతడు పరిగెత్తడానికి చాలా ఇబ్బందులు పడ్డాడు. మ్యాచ్ అనంతరం అతడి గాయానికి స్కానింగ్ నిర్వహించగా తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దీంతో అతడు సెమీస్ కు దూరం కానున్నట్లు పలు రిపోర్టులు చెబుతున్నాయి. ప్రస్తుతం బవుమా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు వెల్లడించింది. మ్యాచ్ సమయాని కల్లా అతడు కోలుకుంటాడన్న ఆశాభావాన్ని టీమ్ మేనేజ్‌మెంట్ వ్యక్తం చేసింది.
Temba Bavuma
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా నవంబర్ 16న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు పైనల్‌కు వెళ్లనుంది. వన్డే ప్రపంచకప్ కోసం ఫైనల్‌లో మొదటి సెమీ పైనల్ మ్యాచ్ విన్నర్‌తో ఢీ కొట్టనుంది. మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.
