Olga Carmona : జట్టును విశ్వవిజేతగా నిలిపింది.. తీవ్ర విషాదంలో ముగిపోయింది.. ఓ ఛాంపియన్ వ్యథ
ఫిఫా మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్ 2023 టోర్నీలో స్పెయిన్ ఛాంపియన్‌గా అవతరించింది. ఆదివారం సిడ్నీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 1-0తో గెలిచింది.
- Thota Vamshi Kumar
- Updated on- August 21, 2023 / 09:53 PM IST
Olga Carmona
Olga : ఫిఫా మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్ 2023 టోర్నీలో స్పెయిన్ ఛాంపియన్‌గా అవతరించింది. ఆదివారం సిడ్నీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 1-0తో గెలిచింది. ఆ జట్టు కెప్టెన్ ఓల్గా కర్మోన (Olga Carmona) గోల్‌తోనే స్పెయిన్ విజేతగా నిలిచింది. మ్యాచ్ ఆరంభం నుంచి స్పెయిన్ దూకుడుగా ఆడింది. 29వ నిమిషంలో కెప్టెన్ ఓల్గా మెరుపు గోల్‌తో స్పెయిన్‌ను ఆధిక్యంలోకి తీసుకువెళ్లింది. ఆ ఆధిక్యాన్ని చివరకంటా కాపాడుకుంటూ వచ్చిన స్పెయిన్ గెలిచింది.
దేశానికి మరపురాని విజయాన్ని అందించిన ఓల్గా ఆ ఆనందాన్ని ఎక్కువ సేపు ఆస్వాదించలేకపోయింది. సంతోషాన్ని అందరితో పంచుకునే లోపే ఓ చెడ్డ వార్తను వింది. తన తండ్రి మరణించాడు అనే వార్త ఆమె చెవిని చేరింది. దీంతో తీవ్ర విచారంలో ఆమె మునిగిపోయింది. మ్యాచ్‌కు ముందే తన మనసు కీడు శంకించిందని చెప్పుకొచ్చింది. ‘అందరిలో ప్రత్యేకంగా నిలిచేలా నాకు శక్తిని అందించావు. నువ్వు ఎక్కడ ఉన్నా నీ చల్లని చూపులు నా మీద ఉంటాయని, ఈ రోజు రాత్రి నా ఆటను చూసి గర్వపడి ఉంటావని నాకు తెలుసు. నీ ఆత్మకు శాంతి చేకూరాలి నాన్నా..’ అంటూ ఆమె సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.
వాస్తవానికి గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తండ్రి శుక్రవారమే కన్నుమూశారు. అయితే.. కూతురు కెప్టెన్సీలోని స్పెయిన్ ఫైనల్‌కు చేరుకోవడంతో ఆమెకు మద్దతు ఇచ్చేందుకు తల్లితో పాటు కుటుంబ సభ్యులు సిడ్నీ స్టేడియానికి వచ్చారు. ఈ విషయాన్ని ఓల్గా వద్ద దాచారు. ఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన తరువాత సంబరాలు చేసుకున్న అనంతరం ఓల్గాకు ఈ విషయాన్ని వారు చెప్పారు.
స్నేహితురాలి కోసం అలా చేసి..
అయితే.. ఫైనల్ మ్యాచ్‌లో గోల్ చేసిన అనంతరం ఓల్గా తన షర్ట్ పైకెత్తి మెర్సీ అనే సందేశాన్ని చూపించింది. అమ్మను కోల్పోయిన తన స్నేహితురాలి కోసం ఆమె అలా చేసింది. కానీ మ్యాచ్ తరువాత ఆమె తన తండ్రి ఇక లేరు అనే వార్తను వినాల్సి వచ్చింది.
Lionel Messi : చరిత్ర సృష్టించిన లియోనల్ మెస్సీ.. అత్యధిక టైటిళ్లు..
