Lionel Messi : చ‌రిత్ర సృష్టించిన లియోనల్‌ మెస్సీ.. అత్య‌ధిక టైటిళ్లు..

ఫుట్‌బాల్‌ దిగ్గజం​ లియోనల్‌ మెస్సీ (Lionel Messi) చ‌రిత్ర సృష్టించాడు. త‌న‌ కెరీర్‌లో 44వ టోఫ్రీని అందుకున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఫుట్‌బాల్‌ ఆట‌గాడు కూడా త‌న కెరీర్‌లో ఇన్ని ట్రోఫీల‌ను సాధించ‌లేదు.

Lionel Messi : చ‌రిత్ర సృష్టించిన లియోనల్‌ మెస్సీ.. అత్య‌ధిక టైటిళ్లు..

Lionel Messi

Lionel Messi Makes History : ఫుట్‌బాల్‌ దిగ్గజం​ లియోనల్‌ మెస్సీ (Lionel Messi) చ‌రిత్ర సృష్టించాడు. త‌న‌ కెరీర్‌లో 44వ టోఫ్రీని అందుకున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఫుట్‌బాల్‌ ఆట‌గాడు కూడా త‌న కెరీర్‌లో ఇన్ని ట్రోఫీల‌ను సాధించ‌లేదు. పీఎస్‌జీని వీడి డేవిడ్‌ బెక్‌హమ్‌ ఇంటర్‌ మయామీ క్లబ్‌లో చేరిన మెస్సీ తొలి సీజ‌న్‌లోనే త‌న జ‌ట్టును విజేత‌గా నిలిపాడు. లీగ్స్ క‌ప్ 2023లో భాగంగా ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచులో నాష్‌విల్లే తో మయామీ త‌ల‌ప‌డింది. పెనాల్టీ ఘాటౌట్‌లో మ‌యామీ (10-9) నాష్‌విల్లేను ఓడించి లీగ్స్ క‌ప్‌ను ముద్దాడింది.

Virat Kohli : సూర‌త్ వ్యాపార వేత్త అభిమానం.. విరాట్ కోహ్లీకి గిఫ్ట్‌గా వజ్రాల బ్యాటు..!

ఆట ఆరంభ‌మైన 24వ నిమిషంలో మెస్సీ గోల్ చేయ‌డంతో మయామి 1-0తో ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. మొద‌టి అర్ధ‌భాగం మొత్తం మ‌యామి త‌న ఆధిక్యాన్ని నిలుపుకుంది. అయితే రెండో అర్ధ‌భాగంలో నాష్‌విల్లే ఆట‌గాళ్లు దూకుడు పెంచారు. ప‌దే ప‌దే మయామి గోల్ పోస్ట్‌ల‌పై దాడులు చేశారు. ఫాఫా పికాల్ట్ గోల్ చేయ‌డంతో 1-1తో స్కోరును స‌మం చేసింది నాష్‌విల్లే. మ్యాచ్ ముగిసే స‌మ‌యానికి ఇరు జ‌ట్లు మ‌రో గోల్ చేయలేదు. దీంతో మ్యాచ్ పెనాల్టీ ఘాటౌట్‌కు దారి తీసింది. పెనాల్టీ ఘాటౌట్ మ‌యామి 10-9తో నాష్‌విల్లేను ఓడించి విజేత‌గా నిలిచింది.

ODI World Cup : వ‌ర‌ల్డ్ క‌ప్ షెడ్యూల్‌లో మ‌ళ్లీ మార్పులు త‌ప్ప‌వా..? భద్రతపై హైద‌రాబాద్ పోలీసుల ఆందోళన..!

కాగా.. నెల‌క్రిత‌మే మెస్సీ ఇంటర్‌ మయామీ జ‌ట్టులో చేరాడు. మొత్తంగా 7 మ్యాచులు ఆడి 10 గోల్స్‌తో రాణించి జ‌ట్టుకు మొద‌టి ట్రోఫిని అందించాడు. ఈ క్ర‌మంలో ఈ అర్జెంటీనా సూపర్ స్టార్ చ‌రిత్ర సృష్టించాడు. త‌న‌ కెరీర్‌లో ఇది అత‌డికి 44వ ట్రోఫీ. అర్జెంటీనా త‌రుపున మెస్సీ 2022 ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ స‌హా 5 టైటిళ్లు గెలుచుకున్నాడు. క్లబ్ కెరీర్‌లో బార్సిలోనా త‌రుపున లా లిగా, UEFA ఛాంపియన్స్ లీగ్‌తో స‌హా 35 టైటిళ్లు సొంతం చేసుకున్నాడు.