ODI World Cup : వ‌ర‌ల్డ్ క‌ప్ షెడ్యూల్‌లో మ‌ళ్లీ మార్పులు త‌ప్ప‌వా..? భద్రతపై హైద‌రాబాద్ పోలీసుల ఆందోళన..!

భార‌త్ వేదిక‌గా అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్(ODI World Cup) జ‌ర‌గ‌నుంది. ఈ మెగా టోర్నీ మ‌రో 46 రోజుల్లో ప్రారంభం కానుంది.

ODI World Cup : వ‌ర‌ల్డ్ క‌ప్ షెడ్యూల్‌లో మ‌ళ్లీ మార్పులు త‌ప్ప‌వా..? భద్రతపై హైద‌రాబాద్ పోలీసుల ఆందోళన..!

More Changes In ICC World Cup

ODI World Cup 2023 : భార‌త్ వేదిక‌గా అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్(ODI World Cup) జ‌ర‌గ‌నుంది. ఈ మెగా టోర్నీ మ‌రో 46 రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే కొన్ని జ‌ట్లు త‌మ ప్రాథ‌మిక టీమ్‌ల‌ను ప్ర‌క‌టించాయి. అటు బీసీసీఐ(BCCI), ఐసీసీ(ICC) లు ఈ మెగా టోర్నీ షెడ్యూల్‌ను ఎప్పుడో విడుద‌ల చేసింది. అయితే.. కొన్ని కార‌ణాల వ‌ల్ల మ‌ళ్లీ రీ షెడ్యూల్‌ చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రికొద్ది రోజుల్లో టికెట్ల విక్ర‌యాలు ప్రారంభం కానుండ‌గా ఇప్పుడు బీసీసీఐకి ఓ కొత్త త‌ల‌నొప్పి వ‌చ్చి ప‌డింది.

హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ స్టేడియం మూడు ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచుల‌కు ఆతిథ్యం ఇవ్వ‌నుంది. కాగా.. ఇందులో భార‌త జ‌ట్టు ఆడే మ్యాచులు లేవు. అక్టోబర్‌ 6న పాకిస్థాన్ vs నెదర్లాండ్స్‌, అక్టోబర్ 9న న్యూజిలాండ్ vs నెదర్లాండ్స్‌, అక్టోబర్ 10న పాకిస్థాన్ vs శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్‌లు హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నున్నాయి. అయితే.. ఇలా వ‌రుసగా రెండు రోజుల్లో రెండు మ్యాచుల‌పై హైద‌రాబాద్ పోలీసులు భద్ర‌తాప‌ర‌మైన ఆందోళ‌న వ్య‌క్తం చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ విష‌యాన్ని హెచ్‌సీఏ(Hyderabad Cricket Association) బీసీసీఐ దృష్టికి తీసుకువెళ్లింది.

Asia Cup : హార్దిక్ పాండ్యాకు షాక్‌.. రోహిత్‌ శర్మ డిప్యూటీగా స్టార్ పేస‌ర్‌..!

వ‌రుస రోజుల్లో మ్యాచులను నిర్వ‌హిస్తే సెక్యూరిటీని క‌ల్పించ‌డంలో ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌ని హైద‌రాబాద్ పోలీస్ విభాగం ఆందోళ‌న వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. కొత్త‌గా ప్ర‌క‌టించిన షెడ్యూల్‌లో సైతం మార్పులు చేయాల‌ని బీసీసీఐని హెచ్‌సీఏ కోరిన‌ట్లువార్త‌లు వినిపిస్తున్నాయి. వాస్త‌వానికి మొద‌ట ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కారం పాకిస్థాన్ vs శ్రీలంక మ్యాచ్ అక్టోబ‌ర్ 12 న‌ జ‌ర‌గాల్సి ఉంది. అయితే.. గుజ‌రాత్‌లో జ‌ర‌గాల్సిన భార‌త్ vs పాక్ మ్యాచ్‌ను అక్టోబ‌ర్ 14కి రీ షెడ్యూల్ చేశారు. దీంతో పాక్ జ‌ట్టుకు త‌గిన మ్యాచ్ ప్రాక్టీస్ స‌మ‌యం ఇచ్చేందుకు అక్టోబ‌ర్ 12న శ్రీలంక‌తో జ‌ర‌గాల్సిన మ్యాచ్‌ను 10కి రీ షెడ్యూల్ చేశారు. మ‌రీ హెచ్‌సీఏ విజ్ఞ‌ప్తిపై బీసీసీఐ, ఐసీసీలు ఏ నిర్ణ‌యం తీసుకుంటాయో వేచి చూడాల్సిందే.

ఇదిలా ఉంటే.. వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ మ్యాచ్‌ల‌కు సంబంధించిన టికెట్ల విక్ర‌యాల రిజిస్ట్రేష‌న్ ఆగ‌స్టు 15 నుంచి ప్రారంభ‌మైంది. ఆగ‌స్టు 25 నుంచి అధికారికంగా విక్ర‌యాలు జ‌ర‌గ‌నున్నాయి.

ప్ర‌పంచ‌క‌ప్‌కు టికెట్లు ఈ తేదీల్లో విక్రయించబడతాయి

ఆగస్ట్ 25 – నాన్ ఇండియా వార్మప్ మ్యాచ్‌లు, అన్ని నాన్-ఇండియా ఈవెంట్ మ్యాచ్‌లు
ఆగస్టు 30 – గౌహతి, త్రివేండ్రంలో జ‌రిగే భార‌త మ్యాచుల టికెట్లు
ఆగష్టు 31 – చెన్నై, ఢిల్లీ, పూణేలో జ‌రిగే భార‌త మ్యాచుల టికెట్లు
సెప్టెంబర్ 1 – ధర్మశాల, లక్నో,ముంబైలో జ‌రిగే భార‌త మ్యాచుల టికెట్లు
సెప్టెంబర్ 2 – బెంగళూరు, కోల్‌కతాలో జ‌రిగే భార‌త మ్యాచుల టికెట్లు
సెప్టెంబర్ 3 – అహ్మ‌ద‌బాద్‌లో జ‌రిగే భార‌త మ్యాచ్ టికెట్లు
సెప్టెంబర్ 15- సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచుల టికెట్లు ల‌ను విక్ర‌యిస్తారు.

IND vs IRE : చ‌రిత్ర సృష్టించిన జ‌స్‌ప్రీత్ బుమ్రా.. విరాట్‌, రోహిత్, ధోని వ‌ల్ల కాలేదు