IND vs IRE : చ‌రిత్ర సృష్టించిన జ‌స్‌ప్రీత్ బుమ్రా.. విరాట్‌, రోహిత్, ధోని వ‌ల్ల కాలేదు

పున‌రాగ‌మ‌నంలో టీమ్ఇండియా పేస్ గుర్రం జ‌స్‌ప్రీత్ బుమ్రా అద‌ర‌గొట్టాడు. డ‌బ్లిన్ వేదిక‌గా ఐర్లాండ్‌తో శుక్ర‌వారం జ‌రిగిన తొలి టీ20లో మొద‌టి ఓవ‌ర్‌లోనే రెండు వికెట్లు తీసి చ‌క్క‌టి బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న చేశాడు.

IND vs IRE : చ‌రిత్ర సృష్టించిన జ‌స్‌ప్రీత్ బుమ్రా.. విరాట్‌, రోహిత్, ధోని వ‌ల్ల కాలేదు

Jasprit Bumrah

India vs Ireland : పున‌రాగ‌మ‌నంలో టీమ్ఇండియా పేస్ గుర్రం జ‌స్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) అద‌ర‌గొట్టాడు. డ‌బ్లిన్ వేదిక‌గా ఐర్లాండ్‌(Ireland)తో శుక్ర‌వారం జ‌రిగిన తొలి టీ20లో మొద‌టి ఓవ‌ర్‌లోనే రెండు వికెట్లు తీసి చ‌క్క‌టి బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. రీ ఎంట్రీలో ఎలాంటి త‌డ‌బాటు లేకుండా ప్ర‌త్య‌ర్థి బ్యాట‌ర్ల‌కు చుక్క‌లు చూపిస్తూ సాగిన బుమ్రా బౌలింగ్ భార‌త అభిమానుల‌కు ఆనందాన్ని ఇచ్చింది. మ‌రో మ‌రో నెల‌న్న‌ర రోజుల్లో ప్రారంభం కానున్న ప్ర‌పంచ‌క‌ప్ ముంగిట‌ భార‌త జ‌ట్టుకు ఇది గొప్ప ఉప‌శ‌మ‌నం అని చెప్పొచ్చు.

2022 సెప్టెంబ‌ర్‌లో బుమ్రా చివ‌రిసారిగా అంత‌ర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఆ త‌రువాత 327 రోజుల సుదీర్ఘ విరామం అనంత‌రం ఐర్లాండ్‌తో టీ20 ఆడాడు. మున‌ప‌టితో పోలిస్తే ర‌న‌ప్‌, వేగం త‌గ్గించిన‌ప్ప‌టికీ బౌలింగ్‌లో మాత్రం మంచి ల‌య క‌నిపిస్తోంది. ఇన్నింగ్స్ మొద‌టి ఓవ‌ర్ రెండో బంతికే బాల్‌బిర్నీని క్లీన్ బౌల్డ్ చేసిన బుమ్రా, అదే ఓవ‌ర్‌లో ట‌క‌ర్‌ను కూడా ఔట్ చేశాడు. మొత్తంగా త‌న నాలుగు ఓవ‌ర్ల కోటాలో 24 ప‌రుగులు ఇచ్చి రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. దీంతో ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు.

Dinesh Karthik : ‘ఫ్లాప్ మూవీ ఇదీ.. చాలా ఇష్టం..’ ఇప్పుడెందుకు గుర్తుకు వ‌చ్చింది డికే..!

ఈ క్ర‌మంలో బుమ్రా అరుదైన రికార్డును నెల‌కొల్పాడు. టీ20 కెప్ఠెన్‌గా అరంగ్రేటం మ్యాచులోనే ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న మొద‌టి భార‌త క్రికెటర్‌గా రికార్డుల‌కు ఎక్కాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ధోని, కోహ్లి, రోహిత్ శ‌ర్మ వంటి మేటీ క్రీడాకారుల‌కు సైతం ఈ రికార్డు సాధ్యం కాలేదు. సీనియ‌ర్ల గైర్హ‌జ‌రీలో యువ ఆట‌గాళ్ల‌తో కూడిన జ‌ట్టుకు బుమ్రా నాయ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 139 ప‌రుగులు చేసింది. ఐరీష్ బ్యాట‌ర్ల‌లో బారీ మెకార్తీ (51 నాటౌట్‌; 33 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స‌ర్లు), కర్టిస్‌ క్యాంఫర్‌ (39; 33 బంతుల్లో 3ఫోర్లు, 1సిక్స్‌)లు రాణించారు. భార‌త బౌల‌ర్ల‌లో బుమ్రా, బిష్ణోయ్, ప్ర‌సిద్ధ్ కృష్ణ త‌లా రెండు వికెట్లు తీశారు. అనంత‌రం 140 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ 6.5 ఓవ‌ర్ల‌లో 47/2 తో ఉన్న స‌మ‌యంలో వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ నిలిచిపోయింది. వ‌ర్షం ఎంత‌కీ త‌గ్గ‌క‌పోవ‌డంతో అప్ప‌టికి భార‌త్‌ డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో రెండు ప‌రుగుల ఆధిక్యంలో ఉండ‌డంతో టీమ్ఇండియాను అంపైర్లు విజేత‌గా ప్ర‌క‌టించారు.

Rinku Singh : కౌన్‌ బనేగా కరోడ్‌పతి షోలో రింకూ సింగ్‌పై ప్ర‌శ్న‌.. స‌మాధానం చెబితే 6 ల‌క్ష‌ల 40 వేలు