India vs Sri Lanka రెండో టీ20 : భారత్ లక్ష్యం 143

  • Publish Date - January 7, 2020 / 03:08 PM IST

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య ఇండోర్ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులకే చేతులేత్తేసింది. దీంతో లంక కోహ్లీసేనకు 143 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

భారత బౌలర్లు విజృంభించడంతో లంక ఆటగాళ్లు తేలిపోయారు. కుశాల్ పెరీరా (34) మినహా మిగిలిన ఆటగాళ్లంతా స్వల్ప స్కోరుకే పరిమితమయ్యారు. టీమిండియా బౌలర్ శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ (3/23) ధాటికి లంక ఆటగాళ్లు చేతులేత్తేశారు. నవదీప్ సైని తన పేస్ బౌలింగ్‌తో శ్రీలంక ఆటగాళ్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. తాను వేసిన 4 ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి 2 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 

అవిష్కా ఫెర్నాండో (22), ఓపెనర్ గుణతిలక (20), డి సెల్వా (17), హసరంగ (16 నాటౌట్), ఒషాడా ఫెర్నాండో (10), రాజపాక్సా (7), ఉదానా (1), పరుగులు చేయగా, మలింగ పరుగులేమి చేయకుండానే నిష్ర్కమించగా, , కుమార (0 నాటౌట్)గా నిలిచాడు.

భారత బౌలర్లలో అత్యధికంగా శార్దూల్ ఠాకూర్ (3/23) వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ (2/38), నవదీప్ సైని (2/18) తలో రెండు వికెట్లు, బుమ్రా (1/32) వాషింగ్టన్ సుందర్ (1/29) తలో వికెట్ తీశారు.  వాషింగ్టన్ సుందర్ 2020లో తొలి వికెట్ తీసిన ఫస్ట్ ఇండియన్ బౌలర్ గా రికార్డు సృష్టించాడు.