ICC T20 : భారత్ – పాక్ మ్యాచ్.. టపాసులు పట్టుకొని దుబాయ్ వెళ్లిన పాక్ అభిమాని
క్రికెట్ అభిమానులకు మౌకా మౌకా యాడ్ గుర్తిండే ఉంటుంది. భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ ఉన్న ప్రతి సారి ఈ యాడ్ కనిపిస్తుంటుంది.
- kunduru Vinod
- Updated on- October 14, 2021 / 02:37 PM IST
Icc T20
ICC T20 : దుబాయ్ వేదికగా అక్టోబర్ 17 నుంచి టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. మొదటి రోజు ఒమెన్, న్యూ గినియా మధ్య జరగనుంది. ఇక అక్టోబర్ 24న దాయాది పాక్‌తో భారత్ తలపడనుంది. ఈ నేపథ్యంలోనే మౌకా మౌకా యాడ్ వైరల్‌గా మారింది. గతంలో కూడా ఈ యాడ్ ఇండియన్ అభిమానులను బాగా ఆకర్షించింది. పాకిస్తాన్‌కి చెందిన అభిమాని తమ జట్టు విజయం సాధిస్తే పటాకులు కాల్చాలని అనుకుంటాడు. పటాకులు డబ్బా పక్కన పెట్టుకొని క్రికెట్ మ్యాచ్ చూస్తుంటాడు. అయితే భారత్ – పాక్ మధ్య ఎన్నిసార్లు మ్యాచ్ జరిగినా భారత్‌దే పైచేయి అవుతుంది. దీంతో సదరు వ్యక్తి ఆ బాంబుల పెట్టెను వచ్చే ఏడాది కోసం దాచిపెడుతుంటాడు. 2015లో ప్రారంభమైన ఈ యాడ్ ఇండియన్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
చదవండి : ICC : బ్యాట్స్ మెన్ కాదు…బ్యాటర్
ఇక తాజాగా ఈ మౌకా మౌకా వీడియో మరోసారి వైరల్ అయింది. మౌకా మౌకా యాడ్‌లోని పాక్ అభిమాని మళ్లీ పటాకులు పట్టుకొని దుబాయ్ వచ్చాడు. తాజాగా యాడ్‌ను బ్రాడ్‌కాస్టర్ స్టార్‌స్పోర్ట్స్ రిలీజ్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ – పాక్ మ్యాచ్ చూసేందుకు టీవీ కొనడానికి తన ఫ్రెండ్ షోరూమ్‌కు పటాకులు పట్టుకొని వస్తాడు ఆ పాక్ అభిమాని. ఇక్కడే అతడి మిత్రుడు ఆటపట్టిస్తాడు. ఈ యాడ్ చూసిన ఇండియన్ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక భారత్ – పాక్ మధ్య గతంలో 5 ప్రపంచ కప్ మ్యాచులు జరగ్గా ఐదింటిలో భారత్ విజయం సాధించింది.
చదవండి : ICC T20 World Cup 2021: భారీ ప్రైజ్‌మనీ ప్రకటించిన ఐసీసీ.. ఎవరెవరికి ఎంతంటే?
