ICC T20 World Cup 2021: భారీ ప్రైజ్‌మనీ ప్రకటించిన ఐసీసీ.. ఎవరెవరికి ఎంతంటే?

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) భారీ ప్రైజ్ మనీ ప్రకటించింది. యూఏఈ, ఒమన్​ వేదికగా అక్టోబర్ 17 నుంచి T20 వరల్డ్‌కప్ 2021 జరుగనుంది.

ICC T20 World Cup 2021: భారీ ప్రైజ్‌మనీ ప్రకటించిన ఐసీసీ.. ఎవరెవరికి ఎంతంటే?

Icc T20 World Cup 2021, Prize Money, T20 World Cup Prize Money, Icc Cash Prize

ICC T20 World Cup Prize Money: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) భారీ ప్రైజ్‌మనీ ప్రకటించింది. యూఏఈ, ఒమన్​ వేదికగా అక్టోబర్ 17 నుంచి T20 వరల్డ్‌కప్ 2021 జరుగనుంది. ఈ మెగా టోర్నీకి సంబంధించి ప్రైజ్‌మనీ వివరాలను ఐసీసీ ప్రకటించింది. టీ20 వరల్డ్‌కప్ టైటిల్ విజేతలకు రూ.12 కోట్లు (1.6 మిలియన్ డాలర్లు) ప్రైజ్‌మనీ అందించనుంది. అలాగే రన్నరప్‌ జట్టుకి రూ.6 కోట్లు (8 లక్షల డాలర్లు) ప్రైజ్‌మనీ అందించనుంది. సెమీ ఫైనల్లో ఓటమి పాలైన రెండు జట్లకు చెరో రూ.3 కోట్లు (నాలుగు లక్షల డాలర్లు) అందించనుంది.

మొత్తం మీద ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2021 కోసం ప్రైజ్ మనీ రూ.42.07 కోట్లు (5.6 మిలియన్ డాలర్లు) అందించనుంది. ఈ మొత్తాన్ని పరిమిత ఓవర్ల టోర్నీలో పాల్గొనే 16 జట్లలోని ఆటగాళ్లకు అందించనుంది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు పురుషుల టీ 20 ప్రపంచకప్‌ జరుగనుంది. ఈ మెగా టోర్నీలో 16 జట్లు పాల్గొంటాయి. మొత్తం 16 జట్లు 5.6 మిలియన్‌ డాలర్లను పంచుకోనున్నాయి. 2016 వరల్డ్‌కప్ మాదిరిగానే సూపర్ 12 దశలో జట్లు గెలిచిన ప్రతి మ్యాచ్‌కు బోనస్‌ రూపంలో కొంత మొత్తాన్ని ఐసీసీ చెల్లించనుంది.
IPL 2021 CSK Vs DC : రెచ్చిపోయిన రుతురాజ్.. ఫైనల్‌లోకి చెన్నై సూపర్ కింగ్స్

సూపర్ 12 దశలో మొత్తం 30 మ్యాచులు జరుగుతాయి. ఈ దశలో గెలిచిన ప్రతి జట్టుకు మ్యాచుకు రూ.30 లక్షల (40 వేల డాలర్లు) వరకు అందించనుంది. ఈ రౌండ్‌ కోసం మొత్తం 12 లక్షల డాలర్లు (రూ.9.01 కోట్లు) ఖర్చు పెట్టనున్నట్లు ఐసీసీ ఒక ప్రకటనలో వెల్లడించింది. సూపర్ 12 నుంచి ఇంటిదారి పట్టే జట్లకు 70వేల డాలర్లను ఐసీసీ అందించనుంది. రౌండ్‌ వన్‌లో గెలిచిన ఒక్కో జట్టుకి రూ.30 లక్షలు (40 వేల డాలర్లు) దక్కుతాయి.

సూపర్ 12 దశలో అర్హత సాధించిన జట్లకు 70వేల డాలర్లు (రూ.52.59 లక్షలు) అందించనుంది. రౌండ్ వన్ టోర్నీలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఐర్లాండ్, నమీబియా, నెదార్లాండ్స్, ఒమన్, పాపా న్యూ గియా స్కౌట్లాండ్ జట్లు పోటీపడనున్నాయి. సూపర్ 12 దశలో మొత్తం 8 జట్లు పాల్గొనున్నాయి. అందులో అప్ఘానిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు పోటీపడనున్నాయి.
IPL 2021: గత ఐపీఎల్ సరిగా ఆడలేదని తెలుసు – మ్యాక్స్‌వెల్