IPL 2021: గత ఐపీఎల్ సరిగా ఆడలేదని తెలుసు – మ్యాక్స్‌వెల్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత సీజన్ 2021లో ఆర్సీబీ ప్లేయర్.. గ్లెన్ మ్యాక్స్ వెల్ సూపర్ ఫామ్ లో కనిపిస్తున్నాడు. వరుసగా మూడో హాఫ్ సెంచరీతో హవా కొనసాగిస్తున్నాడు.

IPL 2021: గత ఐపీఎల్ సరిగా ఆడలేదని తెలుసు – మ్యాక్స్‌వెల్

Glenn Maxwell

IPL 2021: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత సీజన్ 2021లో ఆర్సీబీ ప్లేయర్.. గ్లెన్ మ్యాక్స్ వెల్ సూపర్ ఫామ్ లో కనిపిస్తున్నాడు. వరుసగా మూడో హాఫ్ సెంచరీతో హవా కొనసాగిస్తున్నాడు. ఆదివారం అక్టోబర్ 3న పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.

బ్యాటింగ్ ప్రదర్శనకు గానూ మ్యాక్స్ వెల్ కు మ్యాన్ ఆప్ ద మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడిన స్పీచ్ ను పోస్టు చేస్తూ.. గ్లెన్ ఇలా అన్నాడు. తాను రెండేళ్లుగా ప్రొఫెషనల్ క్రికెట్ లో బాగా ఆడుతున్నానని.. ఐపీఎల్ లో మాత్రం కాదని తానే ఒప్పుకున్నాడు. ఆ ట్వీట్ తో పలువురి విమర్శలకు చెక్ పెట్టినట్లు అయింది.

గతేడాది ఐపీఎల్ సీజన్ లో ఈ ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఇబ్బందిపడ్డ మాట వాస్తవమే. మొత్తం 11ఇన్నింగ్స్ లు ఆడి అతను సాధించిన స్కోర్ కేవలం 108పరుగులు మాత్రమే. ప్రస్తుత సీజన్ లో ఇప్పటి వరకూ 407పరుగులు సాధించాడు మ్యాక్స్ వెల్.

…………………………………………..: సజ్జనార్ మార్క్.. ఆర్టీసీ ఉద్యోగులకు ఎక్స్‌ట్రార్డినరీ లీవ్!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2021ఐపీఎల్ వేలంలో అతణ్ని రూ.14.25కోట్లతో కొనుగోలు చేసింది. నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బౌలర్లు సంధిస్తున్న బంతులను ధీటుగా ఎదుర్కొంటూ పరుగుల దండయాత్ర చేస్తున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఆర్సీబీ 3వ స్థానంలో ఉంది. ఆడిన 12మ్యాచ్ లకు గానూ 8గెలుపొందింది. ఇక ఆర్సీబీ తన తర్వాతి మ్యాచ్ ను సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో అక్టోబర్ 6వ తేదీ ఆడనుంది.