Australian Open : ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌లో సంచ‌ల‌నం.. 35 ఏళ్ల‌లో ఇదే తొలిసారి.. దిగ్గజానికి షాకిచ్చిన‌ భారత ఆట‌గాడు..

భార‌త టెన్నిస్ స్టార్ సుమిత్ నాగ‌ల్ ప్ర‌తిష్టాత్మ‌క ఆస్ట్రేలియా ఓపెన్‌లో సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న చేశాడు.

Sumit Nagal

Australian Open 2024 : భార‌త టెన్నిస్ స్టార్ సుమిత్ నాగ‌ల్ ప్ర‌తిష్టాత్మ‌క ఆస్ట్రేలియా ఓపెన్‌లో సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. మెన్స్ సింగిల్స్‌లో రెండో రౌండ్‌కు దూసుకువెళ్లాడు. మొద‌టి రౌండ్‌లో క‌జకిస్తాన్‌కు చెందిన దిగ్గజ ఆటగాడు అలెగ్జాండర్ బబ్లిక్ పై విజ‌యం సాధించాడు. మంగ‌ళ‌వారం జ‌రిగిన మ్యాచ్‌లో 6-4, 6-2, 7-6 తేడాతో సుమిత్ నాగ‌ల్ గెలుపొందాడు.

ఈ క్ర‌మంలో 1989 త‌రువాత ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఓ సీడెడ్ ఆట‌గాడిపై విజ‌యం సాధించిన భార‌త ప్లేయ‌ర్‌గా రికార్డు సృష్టించాడు. సుమిత్ నగాల్ ర్యాంక్ 139 కాగా.. అలెగ్జాండర్ బబ్లిక్ ర్యాంక్ 27 కావ‌డం విశేషం.

SA20 2024 : ఇలాంటి క్యాచ్ మీ జీవితంలో చూసి ఉండ‌రు..! క్రికెట్ చ‌రిత్ర‌లోనే అద్భుత క్యాచ్‌..!

కాగా.. మూడో రౌండ్‌కు చేరుకోవ‌డ‌మే ఆస్ట్రేలియా ఓపెన్‌లో మెన్స్ సింగిల్స్‌లో టీమ్ఇండియా ప్లేయ‌ర్ల అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న కావ‌డం గ‌మ‌నార్హం. రమేశ్ కృష్ణన్ అయిదు సార్లు మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. 1983, 1984 సీజన్లతో పాటు 1987 నుంచి వరుసగా మూడు సార్లు మూడో రౌండ్‌కు చేరుకున్నాడు.

ఇక‌ భార‌త దిగ్గ‌జ ఆట‌గాడు లియాండ‌ర్ పేస్‌, విజయ్‌ అమృత్‌రాజ్ రెండో రౌండ్‌కే పరిమితమయ్యారు.

Sikandar Raza : టీ20ల్లో జింబాబ్వే కెప్టెన్ అరుదైన ఘ‌న‌త‌.. దిగ్గ‌జ‌ ఆట‌గాళ్ల వ‌ల్లే కాలే..!

ఇదిలా ఉంటే.. స‌మిత్ నాగ‌ల్ ఆస్ట్రేలియా ఓపెన్ మెయిన్ డ్రా సాధించేందుకు ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడు. క్వాలిఫ‌య‌ర్స్ ఆడి అందులో విజ‌యం సాధించి టోర్నీలో అడుగుపెట్టాడు. భార‌త టెన్నిస్ సంఘం నాగ‌ల్‌కు వైల్డ్ కార్డు ఇవ్వ‌లేదు. దీంతో అత‌డు క్వాలిఫ‌య‌ర్స్ ఆడాడు. వ‌రుస‌గా మూడు మ్యాచుల్లోనూ విజ‌యం సాధించాడు. 2021 త‌రువాత సుమిత్ నాగ‌ల్ మెయిన్ డ్రా ఆడ‌డం ఇది రెండో సారి. అప్పుడు తొలి రౌండ్‌లోనే ఓడి ఇంటిముఖం ప‌ట్టాడు.

ట్రెండింగ్ వార్తలు