SA20 2024 : ఇలాంటి క్యాచ్ మీ జీవితంలో చూసి ఉండ‌రు..! క్రికెట్ చ‌రిత్ర‌లోనే అద్భుత క్యాచ్‌..!

సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024లో ఓ అద్భుత క్యాచ్ న‌మోదైంది.

SA20 2024 : ఇలాంటి క్యాచ్ మీ జీవితంలో చూసి ఉండ‌రు..! క్రికెట్ చ‌రిత్ర‌లోనే అద్భుత క్యాచ్‌..!

Romario Shepherd Plucks A One Handed Stunner

SA20 2024-Romario Shepherd : మైదానంలో చిరుత‌లా క‌దులుతూ అద్భుమైన క్యాచులు అందుకున్న ఆట‌గాళ్లు చాలా మందే ఉన్నారు. సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024లో ఓ అద్భుత క్యాచ్ న‌మోదైంది. జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ రొమారియో షెపర్డ్ క్రికెట్ చ‌రిత్ర‌లోనే అత్యుత్త‌మ అన‌ద‌గ్గ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

సోమ‌వారం జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌, డర్బన్‌ సూపర్‌ జెయింట్స్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. డర్బన్‌ సూపర్‌ జెయింట్స్ ఇన్నింగ్స్ సంద‌ర్భంగా ఈ ఘ‌ట‌న‌ చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ నాలుగో ఓవ‌ర్‌ను నంద్రే బ‌ర్గ‌ర్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని ఓ బంతిని జెయింట్స్‌ ఓపెనర్ మాథ్యూ బ్రీట్జ్కే మిడ్‌వికెట్ దిశ‌గా ఓ మంచి షాట్ ఆడాడు. స‌ర్కిల్ ద‌గ్గ‌ర‌లో ఉన్న రొమారియో షెపర్డ్ అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో ఒంతిని ఒడిసి ప‌ట్టుకున్నాడు.

Sikandar Raza : టీ20ల్లో జింబాబ్వే కెప్టెన్ అరుదైన ఘ‌న‌త‌.. దిగ్గ‌జ‌ ఆట‌గాళ్ల వ‌ల్లే కాలే..!

రొమారియో షెపర్డ్‌ నమ్మశక్యంకాని రీతిలో క్యాచ్ అందుకోని తోటి క్రికెట‌ర్ల‌తో పాటు ప్రేక్ష‌కులను నివ్వెరపోయేలా చేశాడు. ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. దీన్ని చూసి వారు సంభ్రమాశ్చర్యాలకు లోన‌వుతున్నారు. నువ్వు మ‌నిషివా సూప‌ర్ మ్యానా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. షెపర్డ్ అద్భుత క్యాచ్ అందుకున్న‌ప్ప‌టికీ ఈ మ్యాచ్‌లో జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్ 37 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన డర్బన్‌ సూపర్‌ జెయింట్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 145 ప‌రుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (64) హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. ల‌క్ష్య ఛేద‌న‌లో జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 108 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. రీజా హెండ్రిక్స్‌ (38), మొయిన్‌ అలీ (36) లు రాణించినా మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో కింగ్స్‌కు ఓట‌మి త‌ప్ప‌లేదు.

Cooch Behar Trophy : క‌ర్ణాట‌క యువ బ్యాట‌ర్ సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న‌.. ఒకే ఇన్నింగ్స్‌లో 404 నాటౌట్‌