Sunil Gavaskar : అతడిపై ఓ కన్నేసి ఉంచండి.. 15 ఇన్నింగ్స్‌ల్లో 10 హాఫ్ సెంచరీలు.. : సునీల్ గవాస్కర్
దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
- Thota Vamshi Kumar
- Updated on- April 11, 2024 / 02:35 PM IST
Sunil Gavaskar Says Selectors Have Eye On Riyan Parag
Sunil Gavaskar – Riyan Parag : ఐపీఎల్ 17వ సీజన్లో మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. ఐపీఎల్ అనంతరం జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం జట్టును ప్రకటించడానికి మే 1 డెడ్‌లైన్‌గా ఐసీసీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక రోహిత్ శర్మ సారథ్యంలో ఈ మెగాటోర్నీలో పాల్గొనే భారత జట్టును ఐపీఎల్లో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేయనున్నారు అనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరుపున దంచికొడుతున్నాడు రియాన్ పరాగ్. ఇటీవల ముగిసిన దేశవాలీ టోర్నమెంట్లో సైతం పరాగ్ పరుగుల వరద పారించాడు. కాగా.. టీ20 ఫార్మాట్లో గత 15 ఇన్నింగ్స్‌ల్లో 170.7 స్ట్రైక్‌రేటుతో 90కి పైగా సగటుతో 771 పరుగులు చేశాడు. ఇందులో 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అతడిని గుర్తుంచుకోవాలని సెలక్టర్లకు సునీల్ గవాస్కర్ సూచించాడు.
Rajasthan Royals : రాజస్థాన్‌కు షాకిచ్చిన ఆడమ్ జంపా.. ఐపీఎల్ నుంచి తప్పుకోవడానికి కారణమదే?
‘సెలక్షన్ కమిటీ అతడి పై ఓ కన్నేసి ఉంచాలి. ఇక అతడు మాత్రం తన ఆటను ఆడుకుంటూ పోతే చాలు.’ అని గవాస్కర్ అన్నారు.
గత 15 టీ20 ఇన్నింగ్స్‌లో పరాగ్ స్కోర్లు ఇవే..
45 (19), 61(34), 76*(37), 53*(29), 77(39), 72(36), 57*(33), 50*(31), 12(10), 8(10), 43(29), 84*(45), 54*(39), 4(4), 76(48) పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా పది అర్ధశతకాలు ఉండడం విశేషం. సెంచరీలు ఉండటం విశేషం.
ఈ సీజన్లో అదరగొడుతున్నాడు..
గత రెండు సీజన్లలలో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరుపున ప్రాతినిధ్యం వహించినా విఫలం అయ్యాడు. అయితే.. ఈ సీజన్లో మాత్రం సత్తాచాటుతున్నాడు. ఇప్పటి వరకు ఐదు మ్యాచుల్లో 261 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 84 నాటౌట్. ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లోనూ దుమ్ములేపాడు. కేవలం 48 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు బాది 76 పరుగులు చేశాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో గుజరాత్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
