Rajasthan Royals : రాజస్థాన్‌కు షాకిచ్చిన ఆడమ్ జంపా.. ఐపీఎల్ నుంచి తప్పుకోవడానికి కారణమదే?
ఐపీఎల్లో మ్యాచులు ఆసక్తికరంగా సాగుతున్నాయి.
![Rajasthan Royals : రాజస్థాన్‌కు షాకిచ్చిన ఆడమ్ జంపా.. ఐపీఎల్ నుంచి తప్పుకోవడానికి కారణమదే? Rajasthan Royals : రాజస్థాన్‌కు షాకిచ్చిన ఆడమ్ జంపా.. ఐపీఎల్ నుంచి తప్పుకోవడానికి కారణమదే?](https://10tv.in/wp-content/uploads/2024/04/Rajasthan-Royals-Star-Adam-Zampa-On-Opting-Out-Of-IPL-2024.jpg)
Rajasthan Royals Star Adam Zampa On Opting Out Of IPL 2024
ఐపీఎల్లో మ్యాచులు ఆసక్తికరంగా సాగుతున్నాయి. రాజస్థాన్ వరుస విజయాల జైత్ర యాత్రకు గుజరాత్ టైటాన్స్ బ్రేక్ వేసింది. బుధవారం జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ పై మూడు వికెట్ల తేడాతో గుజరాత్ విజయాన్ని సాధించింది. ఈ సీజన్లో రాజస్థాన్‌కు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం. ఓటమి బాధలో ఉన్న రాజస్థాన్‌కు వరుస షాకులు తగులుతున్నాయి.
గుజరాత్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కొనసాగించినందుకు రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు ఇప్పటికే రూ.12లక్షల జరిమానా విధించగా తాజాగా ఐపీఎల్ నుంచి ఆ జట్టు స్టార్ బౌలర్ ఆడమ్ జంపా తప్పుకున్నాడు. తాను తీవ్రంగా అలసిపోయానని, ప్రస్తుతం తన శరీరం విశ్రాంతి కోరుకుంటుందని, ఈ నేపథ్యంలో ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. చాలా కాలంగా భారత దేశంలోనే ఉంటున్నానని, టీ20 ప్రపంచకప్ ముందు ఉండడంతో ఈ మెగాటోర్నీకి సన్నద్దం కావాల్సి ఉందన్నాడు.
Hardik Pandya stepbrother : రూ.4.3 కోట్ల మోసం.. హార్దిక్ పాండ్య సోదరుడి అరెస్ట్..
తనకు ఐపీఎల్ కంటే టీ20 ప్రపంచకప్ ఎంతో ముఖ్యమని చెప్పాడు. ఐపీఎల్ ముగిసిన వెంటనే టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది. దీంతో తన శరీరంపై విపరీతమైన ఒత్తిడి పడనుంది. ఈ క్రమంలోనే మెగాటోర్నీకి ముందు కొంత విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నాను అని జంపా అన్నాడు.
ఇక ఐపీఎల్ ఆడకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది మళ్లీ ఐపీఎల్ ఆడాలని అనుకుంటున్నప్పటికీ అది సాధ్యం కావడం లేదన్నాడు. రాయల్స్ విజయాల్లో తన వంతు బాధ్యతలను నిర్వర్తించలేనని భావిస్తోన్నానని, అందుకనే తప్పుకుంటున్నట్లు వ్యాఖ్యానించాడు.
సీనియర్లు రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చహల్ లు ఉండడంతో జంపాకు తుది జట్టులో ఎక్కువగా అవకాశాలు రావడం లేదు. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు ఐదు మ్యాచులు ఆడింది. నాలుగు మ్యాచుల్లో విజయాలు సాధించి 8 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
MS Dhoni : ధోని మాజీ బిజినెస్ భాగస్వామి మిహిర్ దివాకర్ అరెస్ట్
Adam Zampa withdrew from #IPL2024 – here’s why: https://t.co/jjbj69xGln
— cricket.com.au (@cricketcomau) April 10, 2024