Hardik Pandya stepbrother : రూ.4.3 కోట్ల మోసం.. హార్దిక్ పాండ్య సోదరుడి అరెస్ట్..
టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా సోదరుడు వైభవ్ పాండ్యను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.

Hardik Pandya swindled by stepbrother police arrest
Hardik Pandya stepbrother Vaibhav Pandya : టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్య సోదరుడు వైభవ్ పాండ్యను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోర్జరీ ద్వారా అతడు దాదాపు రూ.4.3 కోట్ల నిధులను దారి మళ్లించినట్లు ఆరోపణల నేపథ్యంలో అతడిని అరెస్ట్ చేసినట్లు ఆంగ్ల మీడియాతో కథనాలు వచ్చాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. వైభవ్ పాండ్య స్టార్ ఆటగాళ్లు హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్యాలకు సవతి సోదరుడు.
వీరు ముగ్గరు కలిసి 2021లో పాలిమర్ బిజినెస్ పెట్టారు. హార్దిక్, కృనాల్‌లు చెరో 40 శాతం వైభవ్ 20 శాతం పెట్టుబడితో వ్యాపారాన్ని మొదలుపెట్టారు. పెట్టుబడి ప్రకారం వ్యాపారంలో వచ్చిన లాభాలను పంచుకోవాల్సి ఉంటుంది. అయితే.. వైభవ్ తన సోదరులు ఇద్దరికి తెలియకుండా రూ.4.3 కోట్ల నిధులను దారి మళ్లించాడు. ఈ నిధులతో అతడు మరో సంస్థను నెలకొల్పాడు.
Also Read: ధోని మాజీ బిజినెస్ భాగస్వామి మిహిర్ దివాకర్ అరెస్ట్
ఇది హార్దిక్, కృనాల్ పాండ్యాలకు గణనీయమైన ఆర్థిక నష్టానికి దారితీసింది. హార్దిక్, కృనాల్ సంతకాలను ఫోర్జరీ చేసినట్లుగా వైభవ్ పై ఆరోపణలు వచ్చాయి. దీంతో అతడిపై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు అయ్యాయి.
ఇదిలా ఉంటే హార్దిక్, కృనాల్.. ఐపీఎల్‌తో బిజీగా ఉన్నారు. హార్దిక్ పాండ్య ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అతడి నాయకత్వంలో నాలుగు మ్యాచులు ఆడిన ముంబై ఓ విజయాన్ని సాధించింది. మూడు మ్యాచుల్లో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. కృనాల్.. లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. నాలుగు మ్యాచులు ఆడిన లక్నో మూడు మ్యాచుల్లో గెలిచింది. పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.
Also Read : ఓటమి బాధలో ఉన్న సంజూ శాంసన్‌కు భారీ షాక్.. రూ.12 లక్షల ఫైన్