MS Dhoni : ధోని మాజీ బిజినెస్ భాగ‌స్వామి మిహిర్ దివాక‌ర్ అరెస్ట్‌

మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని మాజీ బిజినెస్ భాగ‌స్వామి మిహిర్ దివాక‌ర్‌ను అరెస్ట్ చేశారు.

MS Dhoni : ధోని మాజీ బిజినెస్ భాగ‌స్వామి మిహిర్ దివాక‌ర్ అరెస్ట్‌

MS Dhoni ex business partner arrested for fraud after CSK star files criminal case

MS Dhoni ex business partner arrested : టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని మాజీ బిజినెస్ భాగ‌స్వామి మిహిర్ దివాక‌ర్‌ను అరెస్ట్ చేశారు. చెన్నై సూప‌ర్ కింగ్స్ స్టార్ ఆట‌గాడు ధోని స్వ‌యంగా దాఖ‌లు చేసిన క్రిమిన‌ల్ కేసు త‌రువాత మోసం ఆరోప‌ణ‌ల‌పై మంగ‌ళ‌వారం అత‌డిని అరెస్టు చేశారు. రాంచీ జిల్లా కోర్టులో సౌమ్యదాస్‌తో పాటు దివాకర్‌పై ధోనీ ఫిర్యాదు చేశాడు. ఇండియన్ పీనల్ కోడ్‌లోని 406, 420, 467, 468,471, 120B సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేయ‌బ‌డింది.

క్రికెట్ అకాడమీల స్థాపనకు ధోనీ పేరును అనధికారికంగా ఉప‌యోగించార‌నే ఆరోప‌ణ‌ల‌పై ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్‌గా ఉన్న‌ మిహిర్ దివాక‌ర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు జైపూర్ పోలీసులు. ధోని త‌న అధికారాన్ని ర‌ద్దు చేసుకున్న త‌రువాత కూడా దివాక‌ర్ భార‌త మాజీ కెప్టెన్ పేరును ఉప‌యోగించి దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ అనేక క్రికెట్ అకాడ‌మీల‌ను ప్రారంభినట్లు తెలిపారు.

Sanju Samson : ఓట‌మి బాధ‌లో ఉన్న సంజూ శాంస‌న్‌కు భారీ షాక్‌.. రూ.12లక్ష‌ల ఫైన్‌

MS ధోని క్రికెట్, స్పోర్ట్స్ అకాడమీల కోసం దివాకర్ డబ్బు తీసుకున్నట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. ఇందులో దాదాపు రూ.15 కోట్లకు పైగా మోసం జ‌రిగిన‌ట్లు తెలిసింది. ఆర్కా స్పోర్ట్స్ ఫ్రాంచైజీ రుసుమును చెల్లించి, ఒప్పందంలో పేర్కొన్న నిష్పత్తిలో లాభాలను పంచుకోవాల్సి ఉంది. అయితే.. వాటిని ఉల్లంఘించిన‌ట్లు, తనకు తెలియకుండానే క్రికెటర్ల అకాడమీలను భాగస్వాములు ఏర్పాటు చేశారని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ పేర్కొన్నాడు.

ధోని భాగస్వాములకు అందించిన అధికార లేఖ ఆగస్టు 15, 2021న ఉప‌స‌హ‌రించుకున్నాడు. అయిన‌ప్ప‌టికీ వారు ధోనీతో ఎటువంటి మొత్తాన్ని లేదా సమాచారాన్ని పంచుకోకుండా అతని పేరు మీద క్రికెట్ అకాడమీలు, స్పోర్ట్ కాంప్లెక్స్‌లను ఏర్పాటు చేయడం కొనసాగించారని అతని న్యాయవాది తెలిపారు.

IPL 2024 : ఇదేంట్రా బాబు..! పాట్ క‌మ్మిన్స్‌కు హారతి ఇచ్చిన అభిమాని.. వీడియో వైరల్