Sunrisers : ‘స‌న్‌రైజ‌ర్స్’ జ‌ట్టులోకి పాక్ ఆట‌గాడు.. కావ్య మార‌న్‌కు బిగ్ షాక్ ఇచ్చిన ఎలాన్ మ‌స్క్‌..!

సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ (Sunrisers) తీసుకున్న ఓ నిర్ణ‌యం పై ప్ర‌స్తుతం విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తోంది.

Sunrisers Leeds Twitter account suspended after buying Pakistan player Abrar Ahmed

  • పాక్ ఆట‌గాడిని కొనుగోలు చేసిన స‌న్‌రైజ‌ర్స్ లీడ్స్‌
  • కావ్య మార‌న్ పై విమ‌ర్శ‌లు
  • ఎక్స్ ఖాతా స‌స్పెండ్‌

Sunrisers : ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభానికి మ‌రికొన్ని రోజులే ఉంది. ఈ క్ర‌మంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ తీసుకున్న ఓ నిర్ణ‌యం పై ప్ర‌స్తుతం విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తోంది. ‘ది హండ్రెడ్’ (The Hundred 2026) లీగ్ ప్లేయర్ల వేలంలో స‌న్‌రైజ‌ర్స్ లీడ్స్ జ‌ట్టు పాకిస్థాన్ క్రికెటర్ అబ్రార్ అహ్మ‌ద్‌ను భారీ మొత్తానికి ద‌క్కించుకుంది. ఏకంగా 2.34 కోట్లు (190,000 పౌండ్లు) అత‌డి కోసం వెచ్చించింది.

మాంచెస్ట‌ర్ సూప‌ర్ జెయింట్స్‌, ఎంఐ లండ‌న్‌, సౌథర‌న్ బ్రేవ్‌, స‌న్‌రైజ‌ర్స్ లీడ్స్ జ‌ట్ల‌లో ఐపీఎల్ ఫ్రాంఛైజీల‌కు వాటాలు ఉన్నాయి. వేలంలో హారిస‌ద్ ర‌వూఫ్, షాదాబ్ ఖాన్ వంటి పాక్ కీల‌క ఆటగాళ్లు ఉన్న‌ప్ప‌టికి కూడా ఐపీఎల్ ఫ్రాంఛైజీల‌కు చెందిన మిగిలిన టీమ్‌లు మాత్రం పాక్ ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేసే సాహ‌సం చేయ‌లేదు. అయితే.. కావ్య మార‌న్ మాత్రం పాక్ ఆట‌గాడు అబ్రార్ అహ్మ‌ద్‌ను కొనుగోలు చేసింది.

Sourav Ganguly : రాత్రి 7.30 గంట‌ల‌కే భార‌త్ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచింది.. న్యూజిలాండ్ చేసిన అతి పెద్ద త‌ప్పు ఇదే.. సౌర‌వ్ గంగూలీ హాట్ కామెంట్స్‌

ఈ క్ర‌మంలో కావ్య మార‌న్, స‌న్‌రైజర్స్ ఫ్రాంచైజీ పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తోంది. పాక్ ఆట‌గాడిని ఎలా కొనుగోలు చేస్తార‌ని మండిప‌డుతున్నారు. వేలంలో స‌న్‌రైజ‌ర్స్ సీఈవో కావ్య మార‌న్‌, ప్ర‌ధాన కోచ్ డానియ‌ల్ వెటోరీ లు పాల్గొన్నారు. స‌న్‌రైజ‌ర్స్ లీడ్స్‌కు హ్యారీ బ్రూక్ నాయ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇంగ్లాండ్ వేదిక‌గా జూలై 21 నుంచి ఆగ‌స్టు 16 వ‌ర‌కు ది హండ్రెడ్ 2026 జ‌ర‌గ‌నుంది.

ఖాతా స‌స్పెన్స‌న్‌..

ఓ వైపు విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తోండ‌గా ఓ కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఎక్స్‌లో స‌న్‌రైజ‌ర్స్ లీడ్ ఖాతా స‌స్పెన్స‌న్‌కు గురైంది. ఖాతా స‌స్పెండ్ కావ‌డ‌గానికి గ‌ల కార‌ణాలు తెలియ‌రాలేదు. యూజ‌ర్లు ఆ ఖాతాలోకి వెళ్లాల‌ని ప్రయ‌త్నిస్తే.. అకౌంట్ స‌స్పెండెడ్ అని వ‌స్తోంది. నిబంధ‌న‌లు అతిక్ర‌మించ‌డంతో ఖాతాను స‌స్పెండ్ చేసిన‌ట్లుగా వ‌స్తోంది.

Sanju Samson : సంజూ శాంస‌న్‌కు తెలిసినంతంగా ఆర్ఆర్ గురించి మ‌రెవ‌రికి తెలియ‌దు.. ఇర్ఫాన్ పఠాన్ హాట్ కామెంట్స్‌..