Ganguly Kohli
Virat Kohli: బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, టీమిండియా వన్డే మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కామెంట్లు ట్వీట్ల వరదకు కారణమవుతున్నాయి. కోహ్లీని వన్డే కెప్టెన్ గా తొలగిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించిన తర్వాత.. బుధవారం జరిగిన ప్రెస్ కాన్ఫిరెన్స్ లో కోహ్లీ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. వన్డే కెప్టెన్సీ నిర్ణయంపై ముందుగానే విరాట్ ను సంప్రదించామని గంగూలీ చెప్తే.. అలాంటిదేం లేదని చెప్పాడు కోహ్లీ.
ఆ తర్వాత గంగూలీకి ప్రశ్నల ధాటి ఎక్కువవుతుంటే.. ‘నా దగ్గర చెప్పడానికి ఏం లేదు. దీనిని బీసీసీఐకే వదిలేస్తున్నాం. వాళ్లే డీల్ చేస్తారు’ అని అన్నాడు.
దీనిపై నెటిజన్లు స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతున్నారు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి సపోర్ట్‌గా.. విరాట్ కోహ్లీకి మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు. #WorldStandsWithKohli, #NationStandsWithDada లు ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్నాయి. కాకపోతే కోహ్లీకే ఎక్కువ పోస్టులు కనిపిస్తున్నాయి.
Virat’s Success Does Not Surprise You. His Failures Do – Sanjay Manjrekar
#WorldStandsWithKohli pic.twitter.com/snUPyR6dnB— Reshebh Pent?? (@reshebpent17) December 17, 2021
టీమిండియాతో పాటు విరాట్ కోహ్లీ ముంబై నుంచి గురువారం ఉదయం దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరారు.