Sushil Kumar bail cancel : ఒలింపిక్ పతక విజేత, రెజ్లర్ సుశీల్ కుమార్(Sushil Kumar)కు సుప్రీం కోర్టు షాకిచ్చింది. సాగర్ ధన్కర్ హత్య కేసులో సుశీల్ కుమార్ కు ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన బెయిల్ ఉత్తర్వులను రద్దు చేసింది(Sushil Kumar bail cancel).
వారంలోపు రెజ్లర్ లొంగిపోవాలని జస్టిస్ సంజయ్ కరోల్, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
కేసు నేపథ్యం ఇదే..
2021లో ఢిల్లీలోని ఛత్రసల్ స్టేడియంలో మాజీ జూనియర్ జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్ సాగర్ ధన్కర్‌తో పాటు అతడి ఇద్దరు స్నేహితులపై రెజ్లర్ సుశీల్‌కుమార్ దాడి చేశాడని కేసు నమోదైంది. ఈ దాడిలో ధన్కర్‌తో పాటు అతడి స్నేహితులు గాయపడ్డారు.
Fans troll Pakistan : ఇది కదా పాకిస్తాన్ అంటే.. విండీస్ కెప్టెన్ కొట్టిన స్కోరును కూడా.. 120కి 92..
అయితే.. తీవ్రంగా గాయపడిన ధన్కర్ చనిపోయాడు. అతడు తీవ్రగాయాలతోనే చనిపోయినట్లు పోస్టు మార్టం నివేదికలో తేలింది.
దీంతో ఢిల్లీ పోలీసులు ముంద్రా ప్రాంతంలో సుశీల్ ను పట్టుకున్నారు. బెయిల్ వచ్చే వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా.. రైల్వేశాఖ సుశీల్ కుమార్ ను ఉద్యోగం నుంచి తొలగించింది.
2022లో ఢిల్లీ ట్రయల్ కోర్టు సుశీల్ సహా 17 మంది పై వివిధ అభియోగాలను నమోదు చేసింది. హత్య, అల్లర్లు, నేరపూరిత కుట్ర, దోపిడి, ఆయుధాల చట్టం వంటి సెక్షన్లు ఉన్నాయి.
మూడున్నరేళ్ల పాటు జైలులో ఉన్న తనకు బెయిల్ మంజూరు చేయాలని సుశీల్ కుమార్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. అతడి వాదనలను పరిణలోకి తీసుకున్న న్యాయస్థానం మార్చి 4న బెయిల్ మంజూరు చేసింది. తాజాగా సుప్రీం కోర్టు ఈ బెయిల్‌ను రద్దు చేయడంతో సుశీల్ జైలుకు వెళ్లాల్సి ఉంది.