Suresh Raina : రైనా సిక్సర్ల వర్షం.. చూసి ఎన్నాళ్లయిందో..!
టీమ్ఇండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనా సిక్సర్లును చాలా అలవోకగా కొట్టేస్తాడు.
- Thota Vamshi Kumar
- Published On : February 27, 2024 / 06:34 PM IST
Suresh Raina
Suresh Raina – IVPL 2024 : టీమ్ఇండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనా సిక్సర్లును చాలా అలవోకగా కొట్టేస్తాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో గానీ, ఐపీఎల్‌లో గానీ అతడు కొట్టిన సిక్సర్లు వేటికి అవే ప్రత్యేకం. అతడి షాట్లు ఎంతో చూడచక్కగా ఉంటాయి. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు వీడ్కోలు పలకడంతో అతడి ఆటను చూసే అవకాశం లేకుండా పోయింది. అయితే.. ఇటీవల ప్రారంభమైన వెటరన్ ప్రీమియర్ లీగ్ 2024 ద్వారా రైనా మరోసారి మైదానంలో దిగాడు.
వీవీఐపీ ఉత్తరప్రదేశ్ కు సారథ్యం వహిస్తున్న రైనా తనలో ఏ మాత్రం సత్తా తగ్గలేదని నిరూపించాడు. సిక్సర్ల వర్షం కురిపించాడు. తన మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించుకున్నాడు. రెడ్ కార్పెట్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో రైనా విధ్వంసం సృష్టించాడు. ఐదో స్థానంలో బరిలోకి దిగిన అతడు 21 బంతులు ఎదుర్కొన్నాడు. ఓ ఫోర్, మూడు సిక్సర్లు బాది 34 పరుగులతో అజేయంగా నిలిచాడు.
కాగా.. రైనా సిక్సర్లకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రైనా.. నీ సిక్సర్లు చూసి ఎన్నాళ్లయిందోనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ లీగ్ లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లో ఉత్తరప్రదేశ్ విజయం సాధించింది. ఇంకెందు ఆలస్యం మీరు రైనా సిక్సర్లను చూసేయండి.
Raina’s vintage magic: 3 sixes, 1 legend.
.
.#SureshRaina #IVPL #FanCode @ivplt20 pic.twitter.com/O0XFPoInLb— FanCode (@FanCode) February 26, 2024
