Suryakumar Yadav ends 115 day injury exile with silver duck
Suryakumar Yadav duck out : టీ20ల్లో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్, ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ నిరాశ పరిచాడు. రీ ఎంట్రీ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై జట్టుతో పాటు ఫ్యాన్స్ సూర్య పై ఎన్నో ఆశలు పెట్టుకోగా అవన్నీ ఆడియాశలు అయ్యాయి.
ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో సూర్య రెండు బంతులు ఎదుర్కొని డకౌట్ అయ్యాడు. అన్రిచ్ నోర్ట్జే బౌలింగ్‌లో సబ్‌సిట్యూట్ ఫీల్డర్ ఫ్రేజర్-మెక్‌గర్క్ క్యాచ్ అందుకోవడంతో పరుగులు ఏమీ చేయకుండానే సూర్య పెవిలియన్‌కు చేరుకున్నాడు.
115 రోజుల విరామం తరువాత..
దక్షిణాఫ్రికా పర్యటనలో మూడో టీ20 మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ సూర్యకుమార్ యాదవ్ గాయపడ్డాడు. దీంతో అతడు ఆటకు దూరం అయ్యాడు. ఇటీవల లండన్‌లో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. కాస్త కోలుకున్న అనంతరం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో పునరావాసం పొందాడు. అక్కడ గాయం నుంచి కోలుకోవడంతో పాటు పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు.
Virender Sehwag : విరాట్ కోహ్లి స్ట్రైక్‌రేట్ పై వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు
ఎన్‌సీఏ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఆడిన తొలి మూడు మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. ఎట్టకేలకు ఎన్ఓసీ రావడంతో జట్టుతో కలిసిన సూర్యకుమార్ యాదవ్ 115 రోజుల విరామం తరువాత మైదానంలోకి అడుగుపెట్టాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో ఢిల్లీతో మ్యాచ్‌లో దుమ్ములేపుతాడని అనుకుంటే డకౌట్ అయ్యాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో రోహిత్ శర్మ(27 బంతుల్లో 49 పరుగులు), ఇషాన్ కిషన్ (23 బంతుల్లో 42 పరుగులు), టిమ్‌డేవిడ్ (21 బంతుల్లో 45నాటౌట్), రొమారియో షెపర్డ్ (10 బంతుల్లో 39నాటౌట్ ) లు రాణించారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్, అన్రిచ్ నార్ట్జే చెరో రెండు వికెట్లు తీయగా, ఖలీల్ అహ్మద్ ఓ వికెట్ పడగొట్టాడు.
A 2 ball duck by Suryakumar Yadav. pic.twitter.com/BwiJmK28VS
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 7, 2024