Suryakumar Yadav : టీ20 కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్ యాదవ్ ఔట్! రేసులో హైదరాబాదీ కుర్రాడు..
Suryakumar Yadav: భారత టీ20 కెప్టెన్‌గా (Team India) సూర్యకుమార్ యాదవ్ శకం ముగిసిందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.
- Thota Vamshi Kumar
- Updated on- June 4, 2026 / 12:54 PM IST
Suryakumar Yadav era will end soon in Indian cricket report
- భారత టీ20 కెప్టెన్సీ నుంచి సూర్య ఔట్!
- నాయకత్వ రేసులో ఇద్దరు స్టార్ ఆటగాళ్లు
Suryakumar Yadav : భారత టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ శకం ముగిసిందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఒకటి లేదా రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పేలవ ఫామ్‌తో సతమతమవుతుండడంతో జట్టులో అతడి స్థానంపై బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చించనున్నారని, కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
ఐర్లాండ్, ఇంగ్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లతో పాటు ఆసియా గేమ్స్‌కు సూర్యకుమార్ యాదవ్‌ను అసలు ఎంపిక చేయకపోవచ్చు. ఈ క్రమంలో భారత తదుపరి టీ20 కెప్టెన్ ఎవరు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
*Virat Kohli : బ్రేకింగ్ న్యూస్.. అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్.. కోహ్లీ ఔట్..!
పీటీఐ ప్రకారం.. సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) స్థానంలో తదుపరి టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టేందుకు ఇద్దరి మధ్య ప్రధానంగా పోటీ ఉంది. వారు మరెవరో కాదు శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ.
ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ ను అద్భుతంగా నడిపిస్తున్నాడు శ్రేయస్ అయ్యర్. కెప్టెన్సీ రేసులో అతడు ముందు వరుసలో ఉంటాడని అంతా భావిస్తున్నారు. అయ్యర్ ఇప్పటివరకు 14 టెస్టులు, 76 వన్డేలు, 51 టీ20లు ఆడాడు.
ఇదిలా ఉంటే.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మను కెప్టెన్‌గా ఎంపిక చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే అతడి వయసు దృష్ట్యా ఎంపిక కమిటీలోని చాలా మంది తిలక్ బెస్ట్ ఆప్షన్ అని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే అతడి కెప్టెన్సీ సామర్థ్యాలను పరీక్షించడానికి శ్రీలంకలో జరిగే ఎ సిరీస్‌కు అతడిని కెప్టెన్‌గా నియమించినట్లు సమాచారం.
*IND vs AFG : అఫ్గాన్‌తో ఏకైక టెస్టుకు ప్రాక్టీస్ షురూ..
ఇక కెప్టెన్సీ రేసులో ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లు ఉన్నప్పటికి కూడా వీరిద్దరు నిలకడగా రాణించకపోవడం అనేది ప్రధాన అడ్డంకిగా మారింది.
