×
Ad

Suryakumar Yadav : భారత్‌తో ఆడొద్ద‌న్న పాక్‌.. తొలిసారి స్పందించిన టీమ్ఇండియా కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్

భార‌త్‌తో మ్యాచ్ ఆడ‌మ‌ని పాక్ ప్రభుత్వ ప్ర‌క‌ట‌న పై టీమ్ఇండియా కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ (Suryakumar Yadav) తొలిసారి స్పందించాడు.

Suryakumar Yadav first reaction on Pakistan boycott in the T20 World Cup 2026

Suryakumar Yadav : మ‌రో రెండు రోజుల్లో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 ప్రారంభం కానుంది. అయితే.. ఈ మెగా టోర్నీలో భార‌త్‌తో మ్యాచ్‌ను ఆడ‌బోమ‌ని పాక్ ప్ర‌భుత్వం మ‌రోసారి స్ప‌ష్టం చేసింది. ఫిబ్ర‌వ‌రి 15న కొలంబో వేదిక‌గా భార‌త్‌, పాక్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గాల్సి ఉంది. పాక్ ప్ర‌భుత్వ నిర్ణ‌యం కార‌ణంగా భార‌త్, పాక్ మ్యాచ్ పై అనిశ్చితి ఏర్ప‌డింది. తాజాగా భార‌త్‌తో మ్యాచ్ ఆడ‌మ‌ని పాక్ ప్రభుత్వ ప్ర‌క‌ట‌న పై టీమ్ఇండియా కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ తొలిసారి స్పందించాడు.

పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడ‌మ‌ని తాము ఎన్న‌డూ చెప్ప‌లేద‌న్నాడు. ఆ జ‌ట్టుతో మ్యాచ్ ఆడేందుకు తాము కొలంబో వెళ‌తామ‌న్నాడు. ఇప్ప‌టికే ఇందుకు సంబంధించిన విమాన టికెట్లు కూడా బుక్ అయ్యాయ‌ని తెలిపాడు.

T20 World Cup 2026 : భార‌త్‌తో మ్యాచ్ బ‌హిష్క‌ర‌ణ‌.. పాక్‌ను వెంటాడుతున్న వ‌రుణుడు.. ఫ‌స్ట్ షాక్..

‘ మా వైఖ‌రి చాలా స్ప‌ష్టంగా ఉంది. మేము వారితో (పాక్) ఆడటానికి నో చెప్పలేదు, వారే నో చెప్పారు. మా విమానాలు బుక్ అయ్యాయి. మేము కొలంబోకు వెళ్తున్నాము. మేం తొలుత యూఎస్‌తో ఆ త‌రువాత న‌మీబియాతో ఆడ‌తాం. ఆ త‌రువాత కొలంబో వెళ‌తాం.’ అని సూర్య‌కుమార్ యాద‌వ్ విలేక‌రుల స‌మావేశంలో తెలిపాడు.

రాజీవ్ శుక్లా ఏమ‌న్నాడంటే?
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ గ్రూప్ స్టేజ్ లో భార‌త్‌తో మ్యాచ్‌ను ఆడ‌మ‌ని మ‌రోసారి పాకిస్తాన్ ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. ఈ విష‌యాన్ని ప్ర‌ధాన షెహ‌బాబ్ షరీఫ్ తెలిపారు. దీనిపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు.

Tilak Varma : ‘ఇది నేను ఊహించ‌లేదు.. నా క‌ల అదే..’ ద‌క్షిణాఫ్రికాతో మ్యాచ్ అనంత‌రం తిల‌క్ వ‌ర్మ కామెంట్స్‌..

పాకిస్తాన్ ప్రభుత్వ నిర్ణయంతో బీసీసీఐకి ఎలాంటి సంబంధం లేద‌న్నాడు. ఐసీసీనే దీనిపై తుది నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని ఆయ‌న అభిప్రాయపడ్డారు. ఐసీసీ ఏ నిర్ణ‌యం తీసుకున్నా కూడా దానికి తాము క‌ట్టుబ‌డి ఉంటామ‌న్నాడు.