Suryakumar Yadav : పాక్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్‌లా మారిపోయిన సూర్యకుమార్ యాదవ్.. వీడియో వైరల్..
టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)స్వయంగా పాక్ స్పిన్నర్ తారిక్ గా మారిపోయాడు.
- Thota Vamshi Kumar
- Published On : February 15, 2026 / 11:46 AM IST
Suryakumar Yadav Mimics Usman Tariq In Nets ahead of Ind vs pak match in T20 World Cup 2026
Suryakumar Yadav : భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య కొలంబో వేదికగా నేడు (ఆదివారం ఫిబ్రవరి 15న) మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి 28 ఏళ్ల పాక్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ పైనే ఉంది. అతడిని భారత బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారా? అన్నదానిపైనే భారత విజయావకాశాలు ఆధాపడి ఉంటాయని పలువురు క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. తారిక్ బౌలింగ్ శైలే ఇందుకు కారణం.
సాధారణంగా ఏ బౌలర్ అయిన క్రీజులోకి వచ్చిన తరువాత తమదైన శైలిలో బంతిని విసురుతారు. లసిత్ మలింగ, జస్‌ప్రీత్ బుమ్రా, మతీషా పతిరాణా వంటి భిన్నమైన శైలితో బౌలింగ్ చేసే వాళ్లను చూశాము. అయితే.. తారిక్ మాత్రం చాలా భిన్నం.
అతడు బౌలింగ్ చేసేందుకు క్రీజులోకి వచ్చాక.. ఓ క్షణం పాటు ఆగి బంతిని విసురుతాడు. అతడి బౌలింగ్ శైలిపై విమర్శలు వచ్చినప్పటికి ఐసీసీ అతడికి క్లీన్ చిట్ ఇచ్చింది.
సూర్య కుమార్ యాదవ్ స్వయంగా..
ఇక పాక్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ ను ఎదుర్కొనేందుకు భారత బ్యాటర్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్వయంగా పాక్ స్పిన్నర్ తారిక్ గా మారిపోయాడు. నెట్స్‌లో అతడు తారిక్ తరహా శైలిలో బ్యాటర్లకు బంతులు వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదేం కోరికరా బాబూ.. భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్‌కు ముందు మాజీ క్రికెటర్ వింత వ్యాఖ్యలు..
28 ఏళ్ల ఉస్మాన్ ఇప్పటి వరకు పాకిస్థాన్ తరుపున నాలుగు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 11 వికెట్లు పడగొట్టాడు.
