IND vs SA : కెప్టెన్ సూర్యకుమార్ గదికి వెళ్లి తిలక్ వర్మ ఏమని అడిగాడో తెలుసా.. సీక్రెట్ బయటపెట్టిన సూర్య

ప్రతీ మ్యాచ్ లో నాల్గో స్థానంలో వచ్చే తిలక్ వర్మ మూడో స్థానంలో క్రీజులో రావడంపై కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మాట్లాడారు..

Tilak Varma

Suryakumar Yadav – Tilak Varma: దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ లో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో భారత్ జట్టు 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ సూపర్ బ్యాటింగ్ చేశాడు. కేవలం 56 బంతుల్లోనే 107 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సిక్సులు, ఎనిమిది ఫోర్లు ఉండటం విశేషం. తిలక్ వర్మ క్రీజులో ఉన్నంతసేపు సౌతాఫ్రికా బౌలర్లపై వరుస బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అయితే, ప్రతీ మ్యాచ్ లో నాల్గో స్థానంలో వచ్చే తిలక్ వర్మ మూడో స్థానంలో క్రీజులో రావడంపై భారత్ జట్టు వ్యూహంలో భాగమనే చర్చ జరుగుతుంది. ఈ విషయంపై మ్యాచ్ గెలిచిన తరువాత టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read: IND vs SA: సెంచరీతో అదరగొట్టిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ.. పోరాడి ఓడిన దక్షిణాఫ్రికా

సూర్యకుమార్ మాట్లాడుతూ.. తిలక్ వర్మ గురించి నేను ఏమి చెప్పగలను. అతను రెండో టీ20 మ్యాచ్ తరువాత నా గదిలోకి వచ్చాడు. నాకు మూడో స్థానంలో బ్యాటింగ్ కు వెళ్లేందుకు అవకాశం ఇవ్వండి.. నేను బాగా రాణించాలనుకుంటున్నాను అని అడిగాడు. వెంటనే నేను బదులిస్తూ.. వెళ్లి నిన్ను నువ్వు నిరూపించుకో అంటూ సూచించడం జరిగింది. తిలక్ వర్మ చెప్పినట్లుగానే మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి అద్భుతమైన ఆటతీరుతో సెంచరీ చేశాడని సూర్యకుమార్ యాదవ్ అభినందించాడు.

Also Read: AUS vs IND : గంభీర్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన రికీ పాంటింగ్‌.. కోహ్లీ గురించి ఏమ‌న్నాడంటే?

తిలక్ వర్మ భారత్ తరపున 19 టీ20 మ్యాచ్ లు ఆడి 496 పరుగులు చేశాడు. అతని పేరుమీద ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. అయితే, గతేడాది అక్టోబర్ నుంచి తిలక్ ఎనిమిది ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేసినా 50 పరుగుల వ్యక్తిగత స్కోర్ చేయలేక పోయాడు. చివరిసారిగా 2023 అక్టోబర్ లో అతను బంగ్లాదేశ్ జట్టుపై ఆఫ్ సెంచరీ చేశాడు. ఆ తరువాత తొలిసారి 50 పరుగుల మార్క్ ను దాటడమే కాకుండా కెరీర్ లో తొలి టీ20 సెంచరీని కూడా నమోదు చేశాడు.

 

\