AUS vs IND : గంభీర్ వ్యాఖ్యలపై స్పందించిన రికీ పాంటింగ్.. కోహ్లీ గురించి ఏమన్నాడంటే?
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ను టీమ్ఇండియా ఆడనుంది.

Ricky Ponting Hits Back At India Coach Gautam Gambhir Remarks
AUS vs IND : బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ను టీమ్ఇండియా ఆడనుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే భారత జట్టు ఆసీస్‌కు చేరుకుంది. ప్రాక్టీస్ మొదలు పెట్టింది. నవంబర్ 22 నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య పెర్త్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇదిలా ఉంటే.. టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఫామ్‌పై ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్ విమర్శలు చేయగా భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా గంభీర్ వ్యాఖ్యలపై పాంటింగ్ స్పందించాడు.
కోహ్లీని అపహాస్యం చేసేందుకు విమర్శలు చేయలేదన్నాడు. కోహ్లీ ఓ క్లాస్ క్రికెటర్ అని అన్నాడు. అతడి ఫామ్ పై మాత్రమే తాను ఆందోళన వ్యక్తం చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇదే విషయాన్ని కోహ్లీని అడిగినా అతడు అదే మాటను అంటాడని అన్నాడు. అంతకముందు వరుస శతకాలతో అదరగొట్టిన అతడు ఇప్పుడు అదే స్థాయిలో ఆడలేకపోతున్నాడు. ఇది అతడిని కించపరిచినట్లు కాదు. అని చెప్పాడు.
గతంలో ఆస్ట్రేలియాలో అతడు అద్భుతంగా ఆడాడని, ఈ సారి కూడా ఆ స్థాయిలో అతడు చెలరేగే అవకాశం ఉందన్నాడు. వాస్తవానికి గంభీర్ వ్యాఖ్యలకు తానేమి ఆశ్చర్యపోనని, అయితే.. టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా ఉంటూ అతడు కామెంట్స్ చేయడమే తనను సర్‌ప్రైజ్ చేసిందని పాంటింగ్ చెప్పాడు.