Asian Champions Trophy : మ‌హిళ‌ల ఆసియా ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భార‌త్‌ దూకుడు.. వ‌రుస‌గా రెండో మ్యాచ్‌లో విజ‌యం..

మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ టీమ్ అద‌ర‌గొడుతోంది.

Asian Champions Trophy : మ‌హిళ‌ల ఆసియా ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భార‌త్‌ దూకుడు.. వ‌రుస‌గా రెండో మ్యాచ్‌లో విజ‌యం..

Asian Champions Trophy India women edges win against South Korea

Updated On : November 13, 2024 / 9:47 AM IST

మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ టీమ్ అద‌ర‌గొడుతోంది. వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని న‌మోదు చేసింది. సౌత్ కొరియాతో మంగ‌ళ‌వారం రాజ్‌గిర్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన మ్యాచ్‌లో 3-2 తేడాతో భార‌త్ విజ‌యం సాధించింది. భార‌త్ త‌రుపున దీపిక రెండు గోల్స్ (20వ‌, 57వ నిమిషంలో) చేయ‌గా సంగీత కుమారి (3వ నిమిషంలో) ఓ గోల్ సాధించింది.

మ్యాచ్ ప్రారంభం నుంచి భార‌త్ దూకుడును ప్ర‌ద‌ర్శించింది. ఈ క్ర‌మంలో మూడో నిమిషంలోనే సంగీత కుమారి గోల్ చేయ‌డంతో భార‌త్ ఆధిక్యంలోకి వెళ్లింది. 20వ నిమిషంలో దీపిక అద్భుత‌మైన గోల్ చేయ‌డంతో భార‌త ఆధిక్యం 2-0కి చేరింది. ఈ స‌మ‌యంలో సౌత్ కొరియా పుంజుకుంది.

IND vs AUS : ఆసీస్‌తో సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు గుడ్‌న్యూస్‌

భార‌త గోల్ పోస్ట్‌ల‌పై ప‌దే ప‌దే దాడుల‌ను చేసింది. ఈ క్ర‌మంలో మూడో క్వార్ట‌ర్స్‌లో వ‌రుస‌గా రెండు పెనాల్టీ కార్న‌ర్లు ల‌భించాయి. ఈ రెండింటి యూరీ లీ(34వ నిమిషం), కెప్టెన్ యున్‌బి చియోన్ (38వ నిమిషం)లో గోల్స్‌గా మలిచారు.

దీంతో 2-2తో స్కోర్ స‌మ‌మైంది. మ‌రో మూడు నిమిషాల్లో ఆట ముగిస్తుంది అన‌గా.. దీపిక గోల్ చేసి భార‌త్‌కు ఆధిక్యాన్ని అందించింది. మ్యాచ్ చివ‌రి వ‌ర‌కు ఆధిక్యాన్ని కాపాడుకున్న భార‌త్ విజేత‌గా నిలిచింది.

AFG vs BAN : కొద్దిలో త‌ప్పించుకున్న ర‌షీద్ ఖాన్‌.. లేదంటే త‌ల‌ప‌గిలేదిగా ? వీడియో