AFG vs BAN : కొద్దిలో త‌ప్పించుకున్న ర‌షీద్ ఖాన్‌.. లేదంటే త‌ల‌ప‌గిలేదిగా ? వీడియో

క్రికెట్ మ్యాచ్ ఆడేట‌ప్పుడు ఆటగాళ్లు గాయ‌ప‌డ‌డం స‌హ‌జం.

AFG vs BAN : కొద్దిలో త‌ప్పించుకున్న ర‌షీద్ ఖాన్‌.. లేదంటే త‌ల‌ప‌గిలేదిగా ? వీడియో

Rashid Khan narrowly escapes serious head injury during AFG vs BAN

Updated On : November 12, 2024 / 1:08 PM IST

AFG vs BAN : క్రికెట్ మ్యాచ్ ఆడేట‌ప్పుడు ఆటగాళ్లు గాయ‌ప‌డ‌డం స‌హ‌జం. అయితే.. బంతి ఆపే ప్ర‌య‌త్నంలో ఇద్ద‌రు ఆట‌గాళ్లు ఢీకొన్న సంఘ‌ట‌న‌లు అప్పుడ‌ప్పుడు చూసే ఉంటాం. తాజాగా అఫ్గానిస్థాన్ స్టార్ ప్లేయ‌ర్ ర‌షీద్ ఖాన్ తృటిలో ప్ర‌మాదాన్ని త‌ప్పించుకున్నాడు. షార్జా వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మూడో వ‌న్డే మ్యాచ్‌లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

బ్యాట‌ర్ కొట్టిన బంతిని ఆపేందుకు ర‌షీద్ ఖాన్ ప్ర‌య‌త్నించాడు. అదే స‌మ‌యంలో వికెట్ కీప‌ర్ ర‌హ్మానుల్లా గుర్భాజ్ సైతం బంతి కోసం ప‌రిగెత్తాడు. రషీద్ ఖాన్ నేల‌పై జారుతూ బంతిని ఆపాడు. అదే స‌మ‌యంలో త‌న ప‌రుగును నియంత్రిచుకోలేక పోయాడు గుర్భాజ్. వీరిద్ద‌రు ఢీ కొట్టుకునే ప‌రిస్థితి నెల‌కొంది. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన గుర్భాజ్‌.. ర‌షీద్ పై నుంచి జంప్ చేశాడు. ఈ క్ర‌మంలో అత‌డి షూ ర‌షీద్ పెట్టుకున్న టోపీకి త‌గిలి కింద‌ప‌డి పోయింది.

ICC : పాకిస్థాన్‌కు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ద‌మైన ఐసీసీ..! పాక్ నిర్ణ‌యం పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి..

ఈ స‌మ‌యంలో కాస్త అటు ఇటు అయినా స‌రే ర‌షీద్ ఖాన్ త‌ల‌కు తీవ్ర గాయ‌మ‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 244 ప‌రుగులు చేసింది. బంగ్లా బ్యాట‌ర్ల‌లో మ‌హ్మ‌దుల్లా (98) తృటిలో సెంచ‌రీని చేజార్చుకున్నాడు. మెహ‌దీ హ‌స‌న్ మిరాజ్ (66) హాప్ సెంచ‌రీతో రాణించాడు. అఫ్గాన్ బౌల‌ర్ల‌లో అజ్మతుల్లా నాలుగు వికెట్లు తీశాడు. అనంత‌రం ర‌హ్మ‌నుల్లా గుర్భాజ్ (101) శ‌త‌కంతో చెల‌రేగ‌డంతో ల‌క్ష్యాన్ని అఫ్గానిస్థాన్ 48.2 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

Sunil Gavaskar : చిత్తుగా ఓడినా బుద్ది రాలేదా.. టీమ్ఇండియా పై సునీల్ గవాస్క‌ర్ ఆగ్ర‌హం.. మ‌ళ్లీ అవే త‌ప్పులు చేస్తున్నారు!