ICC : పాకిస్థాన్‌కు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్దమైన ఐసీసీ..! పాక్ నిర్ణయం పై సర్వత్రా ఆసక్తి..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధం వీడడం లేదు.

If Pakistan rejects hybrid mode of Champions Trophy 2025 then ICC shift venue report
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధం వీడడం లేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్థాన్ వేదికగా ఈ మెగా టోర్నీ జరగాల్సి ఉంది. అయితే.. భధ్రతా కారణాల దృష్ట్యా ఆదేశంలో తాము పర్యటించలేమని, ఈ టోర్నీని హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహించాలని ఇప్పటికే ఐసీసీకి బీసీసీఐ తెలియజేసింది. ఈ విషయన్ని ఐసీసీ కూడా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి మెయిల్ ద్వారా చెప్పింది.
భారత్ ఆడే మ్యాచులను హైబ్రిడ్ మోడ్‌లో యూఏఈలో నిర్వహించాలని సూచించింది. అయితే.. ఎట్టి పరిస్థితుల్లోనూ హైబ్రిడ్ మోడ్‌లో టోర్నీని నిర్వహించవద్దని పాక్ భావిస్తోందట. ఒకవేళ భారత్‌కు అనుకూలంగా ఐసీసీ నిర్ణయం తీసుకుంటే అతిథ్య హక్కులు వదులుకుని టోర్నీ నుంచి నిష్ర్కమించి, న్యాయ పోరాటం చేయాలనే ఆలోచనలో పీసీబీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా స్పోర్ట్స్ టాక్ తెలిపింది. ఒకవేళ పాకిస్థాన్ గనుక హైబ్రిడ్‌కు మోడ్‌కు ఒప్పుకోకుంటే ఈ టోర్నీని దక్షిణాఫ్రికా వేదికగా నిర్వహించాలని నిర్ణయించినట్లుగా పేర్కొంది. భారత్‌ను కాదని ఈ టోర్నీని నిర్వహిస్తే ఆర్థికపరమైన సమస్యలు వస్తాయని ఐసీసీ భావిస్తోందట. ఈ క్రమంలో పాకిస్థాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే.. హైబ్రిడ్ మోడల్ విధానంలో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించడంపై ఎలాంటి చర్చలు జరగలేదని, మొత్తం పరిస్థితిని పీసీబీ అంచనా వేస్తోందని, తరువాత ఏం చేయాలనే దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పీసీబీ అధికారి ఒకరు తెలిపినట్లు రిపోర్టులు వస్తున్నాయి. ప్రస్తుతం పాక్ ప్రభుత్వంతో పీసీబీ చర్చలు జరుపుతుందట. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా బోర్డు పని చేస్తుందని సదరు అధికారి చెప్పారట.
womens Asian Champions Trophy : మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఘనంగా బోణీ కొట్టిన భారత్..