womens Asian Champions Trophy : మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఘనంగా బోణీ కొట్టిన భారత్..
మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఘనంగా ఆరంభించింది

India beat Malaysia in womens Asian Champions Trophy opener
మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఘనంగా ఆరంభించింది. తొలి మ్యాచ్‌లో మలేషియాపై 4-0 తేడాతో విజయం సాధించింది. సంగీత కుమారి రెండు గోల్స్‌తో సత్తా చాటింది. ప్రీతి దూబే, ఉదిత ఒక్కో గోల్ చేశారు. భారత్ తన తదుపరి మ్యాచ్‌ను మంగళవారం దక్షిణ కొరియాతో ఆడనుంది.
మ్యాచ్ ఆరంభంలో మలేషియా జోరు ప్రదర్శించింది. ఐదో నిమిషంలో పెనాల్టీ కార్నర్ లభించింది. దానిని గోల్‌గా మలచడంలో విఫలమైంది. ఆ తరువాత నుంచి భారత్ వేగం పెంచింది. మలేషియా గోల్ పోస్ట్ పై పదే పదే దాడులు చేసింది.
దీంతో రెండు నిమిషాల వ్యవధిలో రెండు పెనాల్టీ కార్నర్‌లు లభించాయి. అయితే.. రెండో పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసుకున్న సంగీత భారత్‌కు తొలి గోల్ (8వ నిమిషంలో) అందించింది.
ప్రీతి రెండు పర్యాయాలు భారత్ ఆధిక్యాన్ని పెంచేందుకు ప్రయత్నించింది. ఆమె ప్రయత్నాన్ని మలేషియా గోల్ కీపర్ అడ్డుకుంది. మూడో క్వార్టర్ ఆఖరి నిమిషంలో (43వ)లో ప్రీతి గోల్ సాధించింది. ఆ వెంటనే లభించిన పెనాల్టీ కార్నర్‌ను ఉదిత (44వ నిమిషంలో) గోల్ గా మలచగా ఆఖరిలో సంగీత (55వ నిమిషంలో )అద్భుతమైన గోల్ సాధించింది. దీంతో భారత్ ఆధిక్యం 4-0కి చేరుకుంది. మ్యాచ్ ఆఖరి వరకు మలేషియా ఒక్క గోల్ కూడా సాధించలేకపోయింది.
India off to a winning start to the Bihar Women’s Asian Champions Trophy Rajgir 2024. 🇮🇳💙
A comprehensive 4:0 victory over Malaysia to begun the defence of the title. 🏑
Watch the highlights of the game here 📹#BiharWACT2024 #IndiaKaGame #HockeyIndia… pic.twitter.com/WMfmiFaAOU
— Hockey India (@TheHockeyIndia) November 11, 2024