Sanjay Bangar : అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన సంజయ్ బంగర్ కొడుకు ఆర్యన్ బంగర్? సంచ‌ల‌నం రేపుతున్న వైర‌ల్ వీడియో

టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ కు సంబంధించిన‌ ఓ వీడియో సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది.

Sanjay Bangar : అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన సంజయ్ బంగర్ కొడుకు ఆర్యన్ బంగర్? సంచ‌ల‌నం రేపుతున్న వైర‌ల్ వీడియో

Sanjay Bangar son hormonal transformation journey video goes viral

Updated On : November 11, 2024 / 1:11 PM IST

టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ కు సంబంధించిన‌ ఓ వీడియో సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది. 10 నెల‌ల క్రితం వ‌ర‌కు అబ్బాయిగా ఉన్న ఆర్య‌న్ ఇప్పుడు పూర్తిగా అమ్మాయిగా మారాడ‌ని ఆ వీడియో ద్వారా తెలుస్తోంది. అత‌డు హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ తీసుకున్నాడు. అంతేకాదండోయ్‌.. త‌న పేరును ఆర్య‌న్ నుంచి అన‌య‌గా మార్చుకున్నారు. ఇక ఈ వీడియోను ఆర్యన్ బంగర్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోనూ షేర్ చేయ‌డం గ‌మ‌నార్హం.

సంజ‌య్ బంగ‌ర్ లాగా ఆర్య‌న్ కూడ ఓ ప్రొఫెష‌న‌ల్ క్రికెట‌ర్ కావాల‌ని క‌ల‌లు క‌న్నాడు. ప్ర‌స్తుతం అత‌డు ఇంగ్లాండ్‌లోని మాంచెస్ట‌ర్‌లో నివ‌సిస్తున్నాడు. అత‌డి సోష‌ల్ మీడియా ఖాతా ప్ర‌కారం అత‌డు ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ ఆడిన‌ట్లుగా తెలుస్తోంది. ఓ ఇన్నింగ్స్‌లో అత‌డు 145 ప‌రుగులు చేసిన‌ట్లుగా ఓ పోస్ట్ ఉంది. ప్ర‌స్తుతం అత‌డు చాలా సంతోషంగా ఉన్న‌ట్లు వైర‌ల్ వీడియోలో చెప్పాడు.

ICC Champions trophy 2025 : నో అంటున్న బీసీసీఐ.. 100 రోజులు కౌంట్ డౌన్ ఈవెంట్‌ను ర‌ద్దు చేసిన ఐసీసీ.. త‌ల‌ప‌ట్టుకున్న పాక్‌!

స్పందించ‌ని సంజయ్ బంగర్..

 

View this post on Instagram

 

A post shared by Anaya Bangar (@anayabangar)

ఈ విష‌యం పై సంజ‌య్ బంగ‌ర్ ఇంకా ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. టీమ్ఇండియా త‌రుపున సంజ‌య్ బంగ‌ర్ 12 టెస్టులు, 15 వ‌న్డేలు ఆడాడు. 29.4 స‌గ‌టుతో టెస్టుల్లో 470 ప‌రుగులు చేశాడు. ఇందులో ఓ సెంచ‌రీ, మూడు అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి.

ఇక వ‌న్డేల్లో 13.8 స‌గ‌టుతో 180 ప‌రుగులు చేశాడు. క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ త‌రువాత బంగర్ 2014 నుండి 2018 వరకు టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హెడ్ కోచ్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాడు.

Gautam Gambhir : ఆసీస్‌తో సిరీస్‌కు ముందు గంభీర్ కీల‌క వ్యాఖ్య‌లు.. రోహిత్ శ‌ర్మ ఆడ‌కుంటే.. చాలా మంది ఓపెన‌ర్లు ఉన్నారు

 

View this post on Instagram

 

A post shared by Anaya Bangar (@anayabangar)