Sanjay Bangar son hormonal transformation journey video goes viral
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది. 10 నెలల క్రితం వరకు అబ్బాయిగా ఉన్న ఆర్యన్ ఇప్పుడు పూర్తిగా అమ్మాయిగా మారాడని ఆ వీడియో ద్వారా తెలుస్తోంది. అతడు హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ తీసుకున్నాడు. అంతేకాదండోయ్.. తన పేరును ఆర్యన్ నుంచి అనయగా మార్చుకున్నారు. ఇక ఈ వీడియోను ఆర్యన్ బంగర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోనూ షేర్ చేయడం గమనార్హం.
సంజయ్ బంగర్ లాగా ఆర్యన్ కూడ ఓ ప్రొఫెషనల్ క్రికెటర్ కావాలని కలలు కన్నాడు. ప్రస్తుతం అతడు ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌లో నివసిస్తున్నాడు. అతడి సోషల్ మీడియా ఖాతా ప్రకారం అతడు ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ ఆడినట్లుగా తెలుస్తోంది. ఓ ఇన్నింగ్స్‌లో అతడు 145 పరుగులు చేసినట్లుగా ఓ పోస్ట్ ఉంది. ప్రస్తుతం అతడు చాలా సంతోషంగా ఉన్నట్లు వైరల్ వీడియోలో చెప్పాడు.
స్పందించని సంజయ్ బంగర్..
ఈ విషయం పై సంజయ్ బంగర్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. టీమ్ఇండియా తరుపున సంజయ్ బంగర్ 12 టెస్టులు, 15 వన్డేలు ఆడాడు. 29.4 సగటుతో టెస్టుల్లో 470 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, మూడు అర్థశతకాలు ఉన్నాయి.
ఇక వన్డేల్లో 13.8 సగటుతో 180 పరుగులు చేశాడు. క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ తరువాత బంగర్ 2014 నుండి 2018 వరకు టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.